NewsOrbit
రాజ‌కీయాలు

17 న ఏపీ భవిష్యత్ తేలనుందా…?

ap 3 capitals issue at supreme court

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం ప్రస్తుతం ఎంత హాట్ టాపిక్కో తెలిసిందే. దీనిపి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వం ఆగష్టు 16న విశాఖలో అడుగుపెట్టాలని ఏర్పాట్లు చేసుకుంది. సీఆర్డీఏను కూడా రద్దు చేసింది. అయితే.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం.. దానిపై స్టేటస్ కో ఇవ్వడం కూడా జరిగింది. దీంతో హైకోర్టు నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఆగష్టు 17న.. సోమవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై సుప్రీం ఏ నిర్ణయం తీర్పు ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది.

ap 3 capitals issue at supreme court
ap 3 capitals issue at supreme court

ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు దాదాపు 300 రోజులుగా ఆ ప్రాంతంలో దీక్షలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏపీకి మూడు రాజధానుల‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సీఆర్డీఏను కూడా రద్దు చేసింది. ఈనేపథ్యంలో ఈ అంశం తుదకు సుప్రీంకోర్టుకు చేరడం సర్వత్రా ఆసక్తిగా మారింది. మూడు రాజధానుల ప్రాధాన్యాన్ని సుప్రీంకు వివరించనుంది ప్రభుత్వం. నిజానికి ఈ పిటీషన్‌ ఇప్పటికే విచారణకు రావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌లో కొన్ని లోపాలు ఉండటంతో ఈనెల 17కు వాయిదాపడింది. ఇందులో భాగంగానే అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్‌-5 జోన్లపై గతంలో దాఖలైన పిటిషన్లపై కూడా న్యాయస్థానం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

లసోమవారం సుప్రీంకోర్టు తీర్పులో స్టేటస్‌ కోను కొట్టివేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ‘విశాఖ’లో పరిపాల‌నా రాజధానికి శంఖుస్థాపన చేయాల‌ని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరిగాయి. సీనియర్ అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వస్తే దసరా సమయానికి కోర్టులో ఉన్న అన్ని పిటీషన్లను పరిష్కరించుకుని అప్పుడు ముందుకెళ్లాలని భావిస్తున్నారు. దీంతో 17న సుప్రీం వెలువరిచే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju