NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఒకే ఒక్క ఆటో డ్రైవర్ – జగన్ వల్ల ఎంత బెనిఫిట్ పొందాడో చూడండి

అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టుకొని సంక్షేమ పథకాలు అన్నీ పచ్చ చొక్కాల వారికే కట్టబెట్టారనీ ఎన్నికల ముందు వైసీపీ నేతలు పదేపదే ఉపన్యాసాలలో దంచేశారు. వైసీపీ అధికారం రావడంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని హామీలు ఇచ్చారు. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలోనూ టీడీపీ సానుభూతి పరులకు 40 శాతంకు పైగా సంక్షేమ పధకాలు మంజూరు అవుతుండటంతో వైసీపీ శ్రేణులు అవాక్కు అవుతున్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా భాద్యతలు చేపట్టిన నాడే గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా సంక్షేమ పథకాల మంజూరులో కులం, మతం, పార్టీ అనే భేదాలు లేకుండా అర్హులందరికీ అందిస్తామని ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికారులు అదే విధంగా లబ్ధిదారుల ఎంపిక నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో నగదు బదిలీ పథకాలు గొప్పగా అమలు జరుగుతున్నా పార్టీ శ్రేణులకు పెద్దగా మైలేజీ రావడం లేదని భావిస్తున్నారు. 40 శాతంకు పైగా టీడీపీ శ్రేణులు లబ్ది పొందుతున్నారని వారు వైసీపీకి ఓటు వేసే రకాలు కాదని పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో అమలు అవుతున్న నగదు బదిలీపై వైసీపీ నేతలు ఏమంటున్నారనే దానిపై ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడి అయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల కోట్లది మంది లబ్ధి పొందుతున్నారు. నగదు బదిలీ వల్ల గ్రామాల్లో కొన్ని కుటుంబాలు ఎంతగా లాభ పడుతున్నాయో అనే విషయాలు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు.

ప్రకాశం జిల్లాలో ఓ టీడీపీ సానుభూతిపరుడైన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఈ పథకాల వల్ల భారీగా లబ్ధి భారీగా చేకూరిందట.. ఆ ఆటో డ్రైవర్ కుటుంబంలో ఇద్దరు పిల్లలు. వారిలో అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరికి అమ్మ ఒడి పథకం కింద రూ.15వేలు, జగన్ అన్న విద్యా దీవెన కింద రూ.20వేలు, ఆటో డ్రైవర్ కావడంతో ఆ పథకంలో రూ.10 వేలు, అతని భార్య టైలర్ కావడంతో ఆ పథకం కింద రూ.10వేలు, రైతు భరోసా కింద రూ.7500తో పాటు ప్రధాని మోడీ ఇచ్చిన 6000 తో రూ.13500 లబ్ధి చేకూరాయి. మొత్తం ఆ కుటుంబానికి అక్షరాల రూ.68,500 సాయం జగన్ ప్రభుత్వంలో అందింది. ఇది గమనించిన వైసీపీ శ్రేణులు అవాక్కు అయ్యారుట. తాము పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నా ఈ మాదిరి సాయం అందలేదంటూ వాపోవడం వారి వంతు అయింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. సీఎం జగన్ ఎంత డబ్బులు ఇచ్చినా నా ఓటు మాత్రం ‘టీడీపీకే’ అని సదరు ఆటో డ్రైవర్ చెప్పడం. ఈ మాటలు విని వైసీపీ శ్రేణులు షాక్ అయ్యారట. ఇది గమనించి అయినా పార్టీ కోసం కష్టపడినవారికి న్యాయం జరిగేలా నాయకులు కృషి చేయాలని వారు కోరుకుంటున్నారుట.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N