NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏపీ బిజెపి లో సమూల మార్పులకు బీజం..!!

Share

ఆంధ్రప్రదేశ్ లో బలోపేతానికి బీజేపీ ఎప్పటి నుండో ప్రణాళికలు వేసుకొంటోంది. 2019 ఎన్నికల ఫలితాల తరువాతనే ఏపి లో 2024 టార్గెట్ గా పావులు కదపడం మొదలు పెట్టింది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ను జత చేసుకోవడం, క్షేత్ర స్థాయిలో జనసేన తో కలిసి బీజేపీ పని చేయాలని నిర్ణయించడం, రాష్ట్రంలోని కీలక అంశాలపై మధ్యస్తంగా వ్యవహరించడం చేస్తూ వచ్చింది. అయితే ఆ పార్టీ కి నాయకత్వ లేమి మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సాధారణంగానే జాతీయ పార్టీలు అంటే రాష్ట్రాల్లో నాయకులు రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఒక పట్టాన ఖాతరు చేయరు. పేరు గొప్ప ఉన్న నాయకులు అందరు జాతీయ పార్టీ ల్లో చేరి హవా చెలాయించాలని చూస్తుంటారు. అదే బీజేపీలో కూడా సమస్యగా మారింది.

అధ్యక్షుడి మార్పునకు ముహూర్తం..?

ఏపీ బిజెపిలో చెప్పుకోవడానికి చాలా మంది నాయకులు ఉన్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు పదులు సంఖ్య లో ఉన్నారు. అందుకే కన్నా ను ఎవరూ పెద్దగా ఖాదరు చేయరు. ఇక రానున్న రెండేళ్లలో ఏపీలో జిల్లా, నియోజక వర్గస్థాయిలో బలోపేతానికి బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా రాష్ట్ర అధ్యక్షుడుని మార్చాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట. కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో మరొకరిని అధ్యక్షుడు గా నియమిస్తే పార్టీ కి కొత్త జోష్ వస్తుందని పార్టీ పెద్దలు అనుకుంటున్నారు. అయితే మరో ఏడాది పాటు కన్నా న్నే కొనసాగించి 2021లో ఏమైనా మార్పులు ఉంటే చేద్దాం అని కూడా కొంత మంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం మీదే కొద్ది కాలంగా తర్జన భర్జన పడుతున్న బీజేపీ పెద్దలు కన్నా ను మార్చడానికే సిద్దమయ్యారట. ఇప్పటికే ఏపి లోని కీలక నాయకులు అయిన పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, సోము వీర్రాజు, పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్ వంటి నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరందరి అభిప్రాయం మేరకు కేంద్ర పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉన్న ఒ నాయకుడికి ఏపీ బీజేపీలో పగ్గాలు ఇవ్వాలని చురుకుగా పావులు కదులుతున్నాయి.

జనసేన పాత్ర ఎంత వరకు ఉండబోతుంది..!

ఏపిలో జనసేన, బీజేపీ కలిసి ప్రయాణించాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ఏడాదికి పైగా ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. మరో మూడున్నరేళ్లు నాలుగేళ్లైనా వచ్చే ఎన్నికల వరకు కలిసి ఉంటాయి. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అందుకే పవన్ ను కూడా కేంద్ర బీజేపీ పెద్దలు అభిప్రాయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఫోన్ లో సంప్రదింపులు జరిగాయినీ, త్వరలోనే పవన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో భేటీ అవుతారని సమాచారం. ఏపి బీజేపీ అధ్యక్షుడి నియామకంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ కీలక నేత, హోం మంత్రి అమిత్ షా సహా జీవీఎల్ నరసింహారావు వంటి బీజేపీ కీలక నాయకుల పాత్ర కూడా ఉంటుంది. ఏపి బీజేపీ నాయకులందరితో మాట్లాడి, జిల్లా అధ్యక్షులందరి అభిప్రాయం తీసుకొని కేంద్ర నాయకత్వంలో కొందరు పెద్దలు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.


Share

Related posts

ఆది నుంచి అనూహ్యం వరకు… అన్న రాజకీయ ప్రస్థానం!!

Comrade CHE

Hetero Drugs: హెటేరోలో డబ్బు కట్టలు సరే..! బీజేపీ పెద్దలు తలదూరుస్తారా..!?

Srinivas Manem

Rajampet Parliament: టీడీపీ వేడి నెలలోనే చల్లారింది ..! రాజంపేట పార్లమెంట్ లో ఎవరిది బలం ..!?

Special Bureau