NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

సోము మెల్లమెల్లగా రాజకీయం మొదలెట్టారుగా..!!

AP BJP ; Planning to Bring Back Venkaiah Naidu

 

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార వై సీ పీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు యుద్ధం ఒక పక్క జరుగుతుండగా, రాష్ట్రంలో బీ జే పీ స్టాండ్ ఏమిటి? ఎలా వ్యవహరిస్తోంది? అన్న చర్చ సాగుతున్నది. ఇటీవల కాలం వరకు అధికార పక్షం వై సీ పీపై, జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తూ వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్మినారాయణ ను పార్టీ అధిష్టానం తప్పించి సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించిన తరువాత అయన స్టైల్ లో అయన వెళుతున్నారు.

AP BJP ; Planning to Bring Back Venkaiah Naidu
Somu virraju

 

కన్నా లక్ష్మీనారాయణ బీ జే పీ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా మాట్లాడటమే కాక రాజధానిని అమరావతిలోనే కొనసాగాలని తీర్మానం కూడా చేయించారు. అయితే సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత అమరావతి రాజధాని అంశంపై అయన ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయలేదు. ఈ సమస్య కు టీ డీ పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణం అంటూ సోము వీర్రాజు విమర్శించారు. పార్టీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం సందర్భంలో ఆ పార్టీ నేతలు రాష్ట్రలో పార్టీ బలోపేతానికి ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామని ప్రకటించారు.

సోము వీర్రాజు భాద్యత చేపట్టిన తరువాత ఒకటి రెండు విషయాల్లో ప్రభుత్వానికి సూచనలు మాదిరిగా ప్రకటనలు విడుదల చేశారే తప్ప ప్రత్యక్ష కార్యక్రమాలకు పూనుకోలేదు. జనసేనతో కలసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సోము వీర్రాజు  పోరాటం ప్రారంభించక పోవడంపై ఇటు బీజేపీ, అటు జనసేన శ్రేణులు అసంతృప్తితో ఉన్నారట. అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై 250 రోజులు దాటిన సందర్భంలోనూ సోము వీర్రాజు  పల్లెత్తు మాట మాట్లాడలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్నా ప్రభుత్వ చర్యలను ప్రశ్నించిన దాఖలాలు లేవు.

ఒక పక్క జనసేనతో పొత్తు, మరో వైపు సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడుగా ఎంపిక చేయడం వల్ల కాపు సామాజిక వర్గం బీజేపీకి కాపు కాస్తుందని కమలనాధులు ఆశించినప్పటికీ ప్రస్తుతం సోము వీర్రాజు వ్యవహరిస్తున్న తీరు కారణంగా అది నెరవేరేలా లేదని అనుకుంటున్నారట. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సోము వీర్రాజు రానున్న రోజుల్లో ఏవిధంగా పావులు కడుపుతారు? రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేయడంలో సఫలీకృతులు అవుతారా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?