AP Cabinet: ఏపీ క్యాబినెట్ మీటింగ్ షురూ..! ఈసారి రసవత్తరంగాా..

Share

AP Cabinet: ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహణకు ప్రభుత్వం సమయాత్తమవుతోంది. జనవరి 21న జరగబోయే క్యాబినెట్ సమావేశం దాదాపు రెండు నెలల తర్వాత జరుగబోతోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తర్వాత జరుగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. మరో రెండు నెలల్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. గతేడాది అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టని ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సమయాత్తమవుతోందని తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా.. ప్రస్తుతం రాష్ట్రంలోని సమస్యలు, కరోనా కేసులు, సినిమా టికెట్ల వివాదం, ఉద్యోగుల పీఆర్సీ అంశం, ఇటివలి జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ap cabinet meeting

అనేక అంశాలతో..

ఈసారి (AP Cabinet) అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల అంశానికి చెందిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత బిల్లును వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఈసారి అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లును ప్రవేశపెడతామని చెప్పడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉద్యోగులకు 23 శాతం పీఆర్సీ ప్రకటించగా ఉద్యోగ సంఘాలు కొంత ఏకీభవించినా.. ఉద్యోగుల నుంచి కొంత వ్యతిరేకత ఉంది. సచివాలయ సిబ్బంది కూడా తమ ప్రొబేషనరీపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశపై కూడా క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఇటివల సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చే వివరాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

బడ్జెట్ నేపథ్యంలో..

ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ కరోనా పరిస్థితులు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పరిస్థితుల దృష్ట్యా కోవిడ్ నిబంధనలు, మందులు, వ్యాక్సినేషన్, ఒమిక్రాన్, సిబ్బంది, ఆంక్షలపై తీసుకోవాల్సిన జాగ్రత్తపై కూడా క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు ఇటివల సీఎం జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలు, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాల్ని కూడా క్యాబినెట్ లో మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది. దీంతోపాటు (AP Cabinet) క్యాబినెట్లో ఆమోదించేందుకు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు వివరాలు తీసుకోనుంది. మొత్తంగా ఈసారి క్యాబినెట్ సమావేశంలో అనేక కీలకాంశాలపై సమీక్ష జరుగనుంది.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

5 గంటలు ago