21న ఎపి కేబినేట్

అమరావతి, జనవరి 19: ఎపి కేబినెట్ సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
21న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ సమావేశంలో రైతులకు సంబంధించిన పధకంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అభివృద్ధి, సంక్షేమ పధకాలకు సంబంధించి పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు.
తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఉదయం అమరావతిలో జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ నేతలు పాల్గొంటారు.