NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

మంత్రివర్గానికి మహూర్తం ఖరారు.. కొత్త మంత్రులు వీళ్లే..?

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ మార్పులకు ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 22న అంటే ఎల్లుండి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. సచివాలయ వర్గాల సమాచారం మేరకు రామచంద్రపురం ఎమ్మెల్యే శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, అలాగే శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు ఇద్దరికి కొత్తగా మంత్రులుగా అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో మంత్రి పదవి కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులుగా అనేక మంది పేర్లు వినిపించినా, సీఎం జగన్.. ఆచి చూసి అడుగులు వేసి ఏ సామాజిక వర్గాలు మంత్రులు అయితే మంత్రి వర్గం నుంచి బయటకు వెళ్తున్నారో అదే సామాజిక వర్గానికి చెందిన వారిని లోపలకు తీసుకుంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు వృత్తి రీత్యా వైద్యుడు. ఐదేళ్లుగా రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికి ఆయనకు అనేక అంశాలపై పట్టు ఉండడం, శాసనసభలో కూడా పార్టీ విధానాలకు తగ్గట్టు సున్నితమైన అంశాలతో సూటిగా మాట్లాడటం, ప్రతిపక్షంను కూడా ఇరుకున పెట్టే వాక్చాతుర్యం ఉండటంతో ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో మోపిదేవి వెంకటరమణ మాదిరిగానే ఆయన కూడా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు. అందుకే ఆయన ఎంపిక వివాదరహితంగా ఉంటుందని జగన్ భావించి ఉండవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే బిసి సామాజిక వర్గానికి చెందిన నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గంలో ఉన్నారు. తాజాగా అప్పలరాజు ను మంత్రి వర్గం లోకి తీసుకుంటే ఆ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు చేరినట్టు అవుతుంది. అయితే శ్రీకాకుళం జిల్లా చిన్నది కావడం 10 శాసనసభ స్థానాలకే ఇద్దరు మంత్రులను ఎంపిక చేస్తారా లేదా అనేది సందేహం నెలకొంది. ప్రస్తుతానికైతే చిదిలి అప్పలరాజు పేరు ఖరారు అయినప్పటికీ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు, సీఎం జగన్మోహన్ రెడ్డి నుండి ఇంకా ద్రువీకరించకపోవడంతో చివరలో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు.

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణది వివాద రహిత ప్రస్థానం. ఆయన కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వివాదరహితుడు కావడం, నియోజకవర్గంలో మంచి పేరు ఉండటం, జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో మరీ ముఖ్యంగా కోనసీమలో ఈ సామాజిక వర్గానికి మంచి పట్టు ఉంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు వెళితే ఆ స్థానాన్ని, ఆ రాజకీయ ప్రస్థానాన్ని భర్తీ చేసేందుకు వీలుగా వేణుగోపాల కృష్ణ కు సీఎం జగన్ అవకాశం ఇచ్చారని అంటున్నారు. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. వేణుగోపాల కృష్ణ కు ఆ అవకాశం ఇస్తారో లేదో ప్రస్తుతానికి తెలియదు. అయితే బిసి సామాజిక వర్గానికి చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు లేదా ధర్మాన కృష్ణదాస్ లలో ఒకరికి ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించే అవకాశం ఉందని అంటున్నారు.ఇవి సచివాలయంలో అనధికార వర్గాలు అందించిన సమాచారం మాత్రమే. పార్టీలో ఉన్నతస్థాయి వర్గాలు వద్ద సీఎం జగన్ ప్రస్తుతానికి ఖరారు చేయలేదు. ఆయన ధ్రువీకరించిన తర్వాత ఈ పేర్లు ఖరారు అవుతాయి. ఏది ఏమైనప్పటికీ ఎల్లుండి మధ్యాన్నం ఒంటి గంట తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!