AP Capitals Bill: సీఎం పెట్టిన మెలిక.. “వెనక్కా – ముందుకా”..! ఎటూ తేలక తికమక..!?

AP Capitals Bill: CM Jagan Still Confusing in Capitals
Share

AP Capitals Bill: ఏపీ మొత్తం ఒక్క అలజడి.. మూడు రాజధానులపై బిల్లులు వెనక్కు తీసుకోవడంతో కొందరిలో ఆశ్చర్యం.., కొందరిలో ఆనందం.. కొందరిలో ఆవేశం.. కొందరిలో ఆవేదన.. అన్నీ కనిపించాయి. వీటిని ఇంకా కొన్నాళ్ళు ఉంచాలనుకున్నారేమో సీఎం జగన్ ఏమి తేల్చలేదు. రాజధానుల అంశంపై సీఎం జగన్ చేసిన ప్రకటనలో కొన్ని అర్ధమైనట్టు ఉన్నప్పటికి.. కొన్ని మాత్రం అర్ధం అయినప్పటికీ అస్పష్టత మిగిల్చాయి.. ఇంతకూ మూడు రాజధానులపై జగన్ ముందుకే వెళ్తారా..!? వెనక్కు వెళ్ళినట్టేనా..!? అనే అనుమానాలు కొన్నాళ్ళు అలాగే ఉండాల్సిందే.. ఇంతకు సీఎం జగన్ ఏమన్నారు..? వాటి చుట్టూ అల్లుకున్న కొత్త సందేహాలేమిటి..!? అనేది కొంచెం లోతుగా చూద్దాం..!

AP Capitals Bill: సీఎం జగన్ ఏమన్నారంటే..!?

సీఎం జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ “1953 నుండి 1956 వరకు ఏపిలో రాజధానిగా కర్నూలు ఉండేది, గుంటూరులో హైకోర్టులో ఉండేది. ఈ ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం అంటే ప్రేమ కూడా ఉంది. ఈ ప్రాంతం అటు విజయవాడ, ఇటు గుంటూరుకు దగ్గర ఏమీ కాదు. ఇక్కడ రోడ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాల ఏర్పాటుకు మాత్రమే అయ్యే ఖర్చు లక్ష కోట్లు అని లెక్కేశారు. అది ఈ రోజు లెక్కల ప్రకారం, పదేళ్లు పోతే ఆ ఖర్చు ఆరు లక్షల కోట్లో 7 లక్షల కోట్లు అవుతుంది. రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. ఇంకా ఉపాధి అవకాశాల కోసం పెద్దనగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మన పిల్లలు వెళ్లాల్సిందేనా అన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉదేశంతోనే విశాఖలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిగా మూడు రాజధానులను తీసుకువచ్చామన్నారు. డీసెంట్రలైజేషన్ ద్వారా మంచి చేయాలని తలంచామన్నారు. ఈ ఏడాదిన్నర కాలంగా రకరకాలుగా అపోహాలు కల్గిస్తూ, న్యాయపరమైన చిక్కులు తీసుకువచ్చి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మూడు రాజధానుల ప్రక్రియ వెంటనే ప్రారంభం అయి ఉంటే ఈ పాటికే మంచి ఫలితాలు కనబడేవన్నారు. శ్రీభాగ్ ఒప్పందం స్పూర్తితో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగానే గడచిన రెండున్నరేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో గెలవడం జరిగిందన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహనం కల్పించి, పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లును సభ ముందుకు తీసుకువస్తామని సీఎం జగన్ అన్నారు.

AP Capitals Bill: CM Jagan Still Confusing in Capitals
AP Capitals Bill: CM Jagan Still Confusing in Capitals

రెండు రకాలుగా అర్ధం చేసుకోవచ్చు..!!

జగన్ మాటల్ని రెండు రకాలుగా అర్ధం చేసుకోవచ్చు. జగన్ మనసులో, మాటల్లో “మూడు రాజధానుల బిల్లుని న్యాయపరంగా అన్ని రకాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేసి తీసుకురాలేదు. అందుకే ప్రత్యర్ధులు ఆటంకాలు సృష్టిస్తున్నారు. అనుకున్న వెంటనే, బిల్లులు ఆమోదం పొందిన వెంటనే ప్రక్రియ మొదలైతే బాగుండేది.. ఆ ఫలితాలు అందేవి..? కానీ అది జరగలేదు. అందుకే వెనక్కు తీసుకుంటున్నాం అన్నారు.. అంటే ఇక్కడితో ఆ ప్రక్రియ ఆపేస్తారేమో.. అనుకునేలోగా… ఇక అమరావతి రాజధానిగా కొనసాగనుంది అని చాల ఆర్గాలు ఫిక్సయ్యేలోగా… చివర్లో ట్విస్ట్ ఇచ్చారు… “ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల ఆమోదం ఉంది కాబట్టే.., అన్ని ఎన్నికల్లో గెలిపించారు అనడం ద్వారా…, మూడు రాజధానులకు ప్రజల ఆమోదం ఉందని పరోక్షంగా ప్రస్తావించినట్టే… మరోవైపు “బిల్లుపై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహనం కల్పించి, పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లును సభ ముందుకు తీసుకువస్తామన్నారు.. సో.. ఈరోజు సీఎం స్పీచ్ ని రెండువైపులా అర్ధం చేసుకోవచ్చు. అయితే మరో వారం, పది రోజుల్లో పూర్తిస్థాయిలో బిల్లులు రానున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ ఈ బిల్లులకు సంబంధించి చర్చ వచ్చే వరకు.., సీఎం జగన్ స్పష్టంగా చెప్పే వరకు ఈ తికమక, అష్పాష్టత కొనసాగుతూనే ఉంటుంది..!


Share

Related posts

చంద్రబాబు మెయిన్ బలం మీద జగన్ ఫోకస్

Yandamuri

నియంత చర్యలు .. చట్టాలు పనిచేయవిక్కడ!! కెసిఆర్ వెనక్కు తగ్గింది ఇందుకే

Comrade CHE

Ys Jagan Mohan Reddy : సీఎం జగన్ కి షాక్ ఇస్తూ రోడ్డెక్కిన గ్రామ వాలంటీర్లు..!!

sekhar