Ys Jagan: ఏపీలో కరోనా డెత్ డేట్ విషయంలో సీఎం జగన్ సెన్సేషనల్ కామెంట్స్..!! 

Share

Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఎప్పుడైతే నియమితులయ్యారో రాష్ట్రంలో విద్యా వైద్య పరంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. ఏ మాత్రం పేదవాడు విద్య, వైద్య విషయంలో ఇబ్బందుల పాలు కాకూడదని సంక్షేమ పథకాల రూపంలో… తన ప్రభుత్వం ద్వారా అనేక సేవలు అందిస్తున్నారు జగన్. ప్రతి పేదవాడు ఉన్నత వ్యక్తులు చదువుకునే రీతిలో సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం అదే తరహాలో ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే పేదవాడు అదే రీతిలో సేవలు అందుకునేలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. “నాడు నేడు” అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా అనేక మార్పులు చేయడం జరిగింది.

Welfare Of Underprivileged Is Our Aim: AP CM YS Jagan | YSR Congress Partyఇదిలా ఉంటే మనిషి శరీరంలో చాలా వరకు వైద్యపరంగా పరీక్షల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో సిటీ స్కాన్ అదేవిధంగా ఎమ్మారై యంత్రాలు లేని పరిస్థితి మొన్నటి వరకు. అయితే ఇప్పుడు ఆ యంత్రాలు కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందుబాటులో కి జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చింది. తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు అదేవిధంగా కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ యంత్రాలను ఓపెన్ చేయడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్స్ మెరుగైన రీతిలో పేదవాడికి సేవలందించే రీతిగా  ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు.

 

అంతమాత్రమే కాకుండా కరోనా చికిత్స విషయంలో ఆశా వర్కర్లు… అంగన్వాడీ కార్యకర్తలు… ప్రభుత్వ యంత్రాంగం వైద్యులు నర్సులు అందరూ చాలా చక్కగా పని చేస్తున్నారని… పెద్ద పెద్ద సిటీలు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్… మన రాష్ట్రంలో లేకపోయినా గాని… దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కెల్లా  కరోనా డెత్ రేట్ మన రాష్ట్రంలో చాలా తక్కువగా ఉందని అది మీ పని తనం వల్లే… ఎవ్వరూ కూడా హోప్ కోల్పోవద్దని… పెద్దగా విసుగు చెందకుండా టెంపర్ లూజు అవ్వకుండా మంచిగా చికిత్స అందించాలని కోరుకుంటున్నట్లు జగన్ వ్యాఖ్యానించారు.


Share

Related posts

Big Boss: బిగ్ బాస్ 5 సీజన్ కోసం కొత్త టెక్నిక్ తో కంటెస్టెంట్ లను సెలెక్ట్ చేస్తున్న నిర్వాహకులు..!!

sekhar

శ్రీముఖి పై నాగబాబు హాట్ కామెంట్స్..! పుసుక్కున నోరు జారేశాడే….?

arun kanna

Maha Samudram: “మహాసముద్రం” లో గరుడ స్టన్నింగ్ లుక్ రివిల్..!!

bharani jella