NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కరోనా గోలలో జగన్ తిప్పిన చక్రం…!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అబ్బో జగన్ వ్యూహం అదుర్స్. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను హైకోర్టు తప్పు పట్టిన నేపథ్యంలో జగన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకే చట్టాలను అవపోసనపట్టిన వ్యక్తికే పదవి కట్టపెట్టారన్న మాట వినిపిస్తుంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆ పదవి నుండి తప్పించేందుకు పెద్ద కసరత్తే చేసినట్లు కనబడుతోంది. పదుల సంఖ్యలో సలహాదారులు ఉన్నప్పటికీ జగన్ ఎవరి సలహాలు తీసుకోరని, ఎవరి మాటలు వినరని, ఆయనకు సలహా ఇచ్చే ధైర్యం ఎవరికి లేదని, ఆయన అనుకున్నదే చేస్తారని ఇప్పటి వరకు ప్రచారంలో ఉంది.

రాష్ట్ర ప్రభుత్వానికి మాట మాత్రంగా కూడా చెప్పకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం సిఎం జగన్మోహన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించిన విషయం విదితమే. దీనితో ఆయనను ఎలా సాగనంపాలనే దానిపై తీవ్ర కసరత్తు చేశారు. మాజీ ఎన్నికల అధికారి రమాకాంత రెడ్డి, రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తదితర మేధావుల తో జగన్ చర్చించారని సమాచారం.

ఇంకా మరో ఏడాది పదవీ కాలం ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించే ప్రక్రియ ప్రారంభిస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించి రహస్యంగా చేయాలిసిన పనులను చేసేశారు. అందరూ కరోనా గోలలో ఉండగా విషయం ఏమాత్రం బయటకు పొక్కకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మూడేళ్ళ కు కుదిస్తూ ఆర్డినెన్సు తీసుకురావడంతో పాటు వెను వెంటనే నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా న్యాయకోవిదుడైన తమిళనాడు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కానగరాజ్ ను నియమించడం, ఆయన వెంటనే బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగి పోయాయి.

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులకు ఎస్ఈసి పదవికి రిజర్వేషన్ కల్పించడం. ఇది న్యాయమూర్తులుకు సంతోషం కల్గించే విషయం. ఇప్పటి వరకు రిటైర్డ్ ఐఏఎస్ లను మాత్రమే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ లుగా నియమితులు అవుతూ వచ్చారు. జగన్ కొత్త సంప్రదాయాన్ని తీసుకొని రావడంలో ఆంతర్యం జగన్నాధుడికే తెలియాలి.

జరగాల్సిన తతంగం అంతా పూర్తి అయింది. ఇప్పుడు ఎస్ ఈ సి పదవి కోల్పోయిన రమేష్ కుమార్ హైకోర్టు ను ఆశ్రయించారు. చూడాలి ఏమిజరుగుతుందో.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Leave a Comment