NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

‘ఇది అమలు అవ్వాల్సిందే ‘ క్యాబినెట్ భేటీ లో మంత్రులకి మొహమాటం లేకుండా చెప్పేసిన వై ఎస్ జగన్ ! 

`మాట త‌ప్ప‌ను..మ‌డమ తిప్ప‌ను` అనే హామీతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల అభిమానం గెలుచుకొని అధికారంలోకి వ‌చ్చిన వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి…. సీఎం కుర్చీలో కూర్చున్న త‌ర్వాత `చెప్పాడంటే…చేస్తాడంతే…“అనే రీతిలో ప‌రిపాల‌న‌లో ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

వివిధ సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌తో ముందుకు సాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

అక్కచెల్లమ్మల చేతికి..
ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన బుధ‌వారం మంత్రివర్గ సమావేశం జ‌రిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప‌లు కీలక నిర్ణ‌యాలు తీసుకున్నారు. నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్‌ ఆమోదముద్ర `వైయస్సార్‌ ఆసరా`కు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏఫ్రిల్‌ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా చెల్లించనున్న ప్రభుత్వం నాలుగేళ్లలో రూ. 27,169 కోట్లు అక్కచెల్లమ్మల చేతికి ప్రభుత్వం ఇవ్వ‌నుంది. 2020–21 సంవత్సరానికి రూ.6792.21 కోట్లు ప్రభుత్వం ఇవ్వనుంది. దాదాపు 90 లక్షల మంది లబ్ధిదారులు ఈ మేర‌కు ప్ర‌యోజ‌నం పొంద‌నున్నారు.

ఇంకో రెండు ముఖ్య పథకాలు…

సెప్టెంబరు 5 న జగనన్న విద్యా కానుక ప్రారంభానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి జ‌ర‌గ‌నుంది. మూడు జతల యూనిఫారాలు, నోటు బుక్కులు, పాఠ్య‌పుస్త‌కాలు, ఒక జత షూ,రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్‌ బ్యాగ్‌ విద్యా కానుక కింద పంపిణీ చేయ‌నున్నారు. విద్యా కానుక కోసం రూ.648.09 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
సెప్టెంబరు 1న వై.యస్‌.ఆర్‌. సంపూర్ణ పోషణ్‌ ప్లస్, సంపూర్ణ పోషణ్‌  ప్రారంభం కానుంది. 77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ ప్లస్, మిగిలిన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ అమలు చేయ‌నున్నారు. గర్భవతులకు, బాలింతలకు, 6 నుంచి 36 నెలల వరకు, అలాగే 36 నుంచి 72 నెలల పిల్లలకు  పౌష్టికాహారం అందించ‌నున్నారు. ఈ కార్యక్రమాలకు ఏడాదికి రూ.1863 కోట్లు కేటాయించారు. 30 లక్షల మందికి లబ్ధి చేకూర‌నుంది.

యువతకు ఊహించని తీపికబురు….

గతంలో కేవలం రక్తహీనతతో ఉన్న గర్భవతులకు, బాలింతలకు మాత్రమే ఆహారం అందించగా… ఇప్పుడు అందరు బాలింతలకు, గర్భవతులకు వర్తించ‌నుంది. గత ప్రభుత్వ కాలంలో రూ.762 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. ఈ ప్రభుత్వ కాలంలో మూడు రెట్లు పెంచి దాదాపు రూ.1863 కోట్లు కేటాయించి అమలు చేస్తున్నారు. డిసెంబరు 1నుంచి లబ్దిదారుల గడప వద్దకే తినగలిగే నాణ్యమైన బియ్యం అందించడానికి చర్యలు తీసుకోనున్నారు. 9260 వాహనాలు కొనుగోలు కోసం రుణాలు తీసుకునేందుకు సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్యారంటీ ఉండ‌నుంది. సార్టెక్స్‌ చేసిన నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదార్ల ఇంటి వద్దకే చేర్చేందుకు ఈ వాహనాలు వినియోగించ‌నున్నారు. 60 శాతం సబ్సిడీ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు ఈబీసీ యువకులకు స్వయం ఉపాధి కింద ఈ వాహనాలను అందిస్తారు.

ప్రభుత్వతమే ఇలాంటి నిర్ణయం….

వాహనాల కోసం లబ్ధిదార్లు 10 శాతం చెలిస్తే చాలు30 శాతం బ్యాంకు రుణం కాగా 60 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వనుంది. నిరుద్యోగులైన యువకులకు ఈ కాంట్రాక్టు ఆరేళ్ల పాటు ప్రభుత్వం ఇవ్వ‌నుంది. ప్రతినెలా రూ.10 వేలు ఆదాయం వచ్చేలా ఉపాధి మార్గం ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీని కోసం రూ.550 కోట్లు ఖర్చు చేయనుంది.ప్రభుత్వం సార్టెక్స్‌ చేయడం వల్ల గతంలో 25 శాతం ఉన్న నూకలు 15 శాతానికి తగ్గనుంది. రంగు మారిన బియ్యం 6 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గనుంది. ఇందుకు గాను ప్రతి కిలోకు అదనంగా రూ.1.10 వ్యయం 30 పైసలు డిస్ట్రిబ్యూషన్‌ కోసం ఖర్చు చేయ‌నున్నారు. పర్యావరణహితంగా ఉండే 10 కేజీలు, 15 కేజీలు  రీయూజబుల్‌  బ్యాగులు లబ్దిదార్లకు ప్రభుత్వం ఇవ్వనుంది. మొత్తం సార్టెక్స్‌ చేయడానికి రూ.480 కోట్లు వ్యయం కానుంది.

దురదృష్టవశాత్తు…
వై.ఎస్‌.ఆర్‌.బీమా కింద సామాజిక భద్రతా పథకం అమ‌లు చేయ‌నున్నారు. 18–50 ఏళ్ల మధ్య వ‌య‌సు వారికి వర్తింపు చేయ‌నుంది. సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, 51–70 ఏళ్ల మధ్య వర్తింపుబియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే వర్తించనున్న వై.యస్‌.ఆర్‌. బీమా అమ‌లు చేయ‌నున్నారు.

చిత్తూరు జిల్లాకు….

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 26 టీచింగ్‌ పోస్టులు, 14 నాన్‌ టీచింగ్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వై.ఎస్‌.ఆర్‌ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్‌ పోస్టులు, 8 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో అదనంగా 2 యూనిట్లు115 మెగావాట్లు చొప్పున 2 యూనిట్లు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా వివిధ నిర్ణ‌యాల‌కు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆమోదం తెలిపారు. ఈ ప‌థ‌కాలు అంద‌రికీ అందేలా అమ‌లు చేయాల్సింద‌నేన‌ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం.

author avatar
sridhar

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!