YS Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ దిగి ఛాలెంజ్ విసరడంపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. బుధవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ పై మరో సారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జగన్. సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ పోటోలు కాదని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, పేద ఇంటి ముందు నిలబడి ఈ ఇంటికి మంచి జరిగిందని చెప్పడమే అదే నిజమైన గొప్ప సెల్ఫీ అని అన్నారు జగన్. ఈ ప్రభుత్వం గొప్ప పని చేసిందని ఆశీర్వదిస్తే దానిని సెల్ఫీ అంటారని జగన్ అన్నారు. ఏ గ్రామంలోనైనా, ఏ పేద కుటుంబమైనా గత ప్రభుత్వంలో జరిగిన మంచి ఎంత..ఈ ప్రభుత్వంలో అందిన పథకాలు ఎన్ని అని బేరీజు వేసుకునే సత్తా ఉందా అని చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్ విసిరారు. ప్రజలందరికీ నిజాలు తెలుసునని అన్నారు.

సభలో చంద్రబాబును ఆ ముసలాయన అంటూ పలు మార్లు సంభోదిస్తూ విమర్శలు చేశారు సీఎం జగన్. గతంలో ఒక ముసలాయన సీఎం గా ఉన్నప్పుడు ఈ పథకాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఆ ముసలాయన హయాంలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లోకి వేశారా అని ప్రజలను అడిగారు. గతంలో జరగనివి ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో ఆలోచన చేయాలన్నారు. ఈ డబ్బంతా ఆ ముసలాయిన పాలనలో ఎవరు దోచుకున్నారు.. ఎవరు పంచుకున్నారు.. ఎవరు తిన్నారు అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ ముసలాయన మాట్లాడడు అంటూ విమర్శించారు.

నిజాలు దాచి నిందలు, అబద్దాలు దాచి ప్రచారాలు చేస్తారని మండిపడ్డారు. ఒక అబద్దాని వంద సార్లు చెప్పి నిజాలు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనీ, గత పాలనలో వారేం చేశారో చెప్పాలన్నారు. సెల్ఫీ దిగే నైతికత, పాలన గురుంచి ఇంటికి స్టిక్కర్ వేసే దైర్యం ఉందా.. గతంలో రుణ మాఫీ చేస్తామని చెప్పి రైతులను రోడ్డు మీద నిలబెట్టారని అన్నారు. ఈ మోసాల బాబును గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారో ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. తన పరిపాలనలో ఇప్పటి వరకూ రూ.2.07 కోట్లను లబ్దిదారులకు ఇచ్చామని వివరించారు. మహిళలనే అన్ని పథకాల్లో లబ్దిదారులుగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని జగన్ అన్నారు.
ఈ అక్టోబర్ నెలలో వెలిగొండ ప్రాజెక్టు ను ప్రారంభిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మొదటి టెన్నెల్ తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామని గుర్తు చేశారు. రెండో టెన్నెల్ కూడా పూర్తి కావచ్చిందన్నారు. ఇదే సందర్భంగా మార్కాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కోట్ల నిధులను జగన్ ప్రకటించారు.
పంజాబ్ మిలటరీ స్టేషన్ లో కాల్పుల కలకలం .. నలుగురు మృతి