NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎం సంక్రాంతి కి ఇల్లు ఇవ్వొచ్చు గా?? : బీజేపీ కొత్త మెలిక

 

 

(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి )

ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడిన పేదల ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. క్రిస్మస్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నలబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసి అదేరోజు ఇంటి నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేయాలని సర్కారు భావిస్తోంది. మరోపక్క  టిడికో ఇళ్లను సైతం లబ్ధిదారులకు ఎలాంటి రుసుము చెల్లించకుండానే అందించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసిన క్రిస్మస్ తేదీ మీద ఇప్పుడు రాజకీయం పులుముకుంటోంది. క్రిస్టియన్లకు అత్యంత పవిత్రమైన యేసు జన్మదినం రోజు అని చెప్పుకునే క్రిస్మస్ రోజున ఇళ్ల పట్టాలను సర్కారు కావాలని పంపిణీ చేస్తోందని, ముఖ్యమంత్రి ఎక్కువగా నమ్మే క్రిస్టియానిటీ కు అనుగుణంగా క్రిస్మస్ రోజున నవరత్నాల్లో ప్రధానమైన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసిందని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. సరిగ్గా 15 రోజులకు సంక్రాంతి పండుగ వచ్చే తరుణంలో హిందువుల పెద్ద పండుగ భావించే ఈ పండుగ రోజున ఇంటి పట్టాలను అందిస్తే పేదలు ఎంతో సంతోషిస్తారని, అలాంటిది క్రిస్మస్ రోజున పెంచుకోవడం ముఖ్యమంత్రి ఆడిన నాటకమే అని బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా లో సైతం విపరీతంగా ట్రోలింగ్ లు నడుస్తున్నాయి. గాంధీ జయంతి అక్టోబర్ జయంతి వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటూ 6 సార్లు వాయిదా పడిన ఈ ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమానికి క్రిస్మస్ రోజే బీజేపీ పెద్దలు ఆరోపణలకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకే ఎన్నిసార్లు కావాలని ఈ పట్టాల పంపిణీ వాయిదా వేశారని, ఇప్పుడు ఆయన పండుగగా భావించే క్రిస్మస్ రోజున దీని మొదలు పెడుతున్నారంటూ రాజకీయానికి మతం రంగు పులుము తున్నారు.

 

model house

తెలిసే జరిగిందా??

ఇప్పటివరకు కోర్టు కేసులు ఉన్నాయని ఇళ్ల పట్టాల కార్యక్రమం వాయిదా వేస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు లాజికల్గా ఆలోచించి ఇంటి పట్టాలు కార్యక్రమం పై ముందుకు సాగింది. ఇంటి పట్టాల విషయంలో మొత్తం భూమి పై ఎలాంటి అభ్యంతరాలు కోర్టు కేసులు లేవు. కేవలం కొన్ని చోట్ల మాత్రమే దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. ఆయా స్థలాల సేకరణ విషయంలో ఉన్న గొడవలు, లీగల్ అంశాల్లో ఉన్న మెడికల్ ఆధారంగానే ఆయా స్థలాల విషయంలో కేసులు కోర్ట్ ల వరకు వెళ్లాయి. అయితే మొదటి నుంచి వైఎస్ఆర్ సీపీ నాయకులు మాత్రం మొత్తం స్థలాల విషయంలోనే కేసులు ఉన్నట్లు మాట్లాడారు. దీనికి ప్రధాన ప్రతిపక్షం టిడిపి మద్దతుదారులు వేసిన కేసులే ప్రధానమని ప్రజలకు చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కేవలం కేసుల వరకు వెళ్ళిన స్థలాలను పక్కనపెట్టి, ఎలాంటి వివాదం లేని స్థలాలు లబ్ధిదారులకు ఇచ్చేలా కలెక్టర్లకు సూచనలు ఇచ్చింది. మొత్తం 30,68,281 లబ్ధిదారులను గుర్తించారు. కేవలం కోర్టు కేసుల వల్ల ఆగిపోతుంది మాత్రం ఆగిపోతుంది 40 వేల లబ్ధిదారులు మాత్రమే. ఇప్పుడు ఆ 40 వేల మందిని పక్కనబెట్టి మిగిలిన వారికి పట్టాల పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కేసులు ఉన్న స్థలాల్లో ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అయితే ఇది ఎప్పుడో చేయాల్సిన పని. లబ్ధిదారులు అందరికీ ఎలాంటి వివాదాలు లేకుండా ఒకరికి ముందు ఒక గుణం అని కాకుండా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పట్టాలను అందించాలని సర్కారు భావించి ఎన్ని రోజులు వాయిదా వేసినట్లు వైఎస్ఆర్సిపి నాయకులు చెబుతుంటే, క్రిస్మస్ పండుగ రోజే ఇవన్నీ చేయాలనే తలంపుతో నే జగన్ ప్రభుత్వం ఇన్నిరోజులు నాటకం ఆడిందని బీజేపీ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి కి లీగల్ అంశాలపై కనీస పరిజ్ఞానం ఉండద అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

jagan mohan reddy

1.80 సరిపోతాయా?

ఇంటి పట్టాలు ఇచ్చిన వెంటనే ఇళ్ల నిర్మాణం చేస్తామని జగన్ ప్రకటించారు. అన్ని ఇల్లు ఒకే మోడల్ లో ఉండేలా డిజైన్లను ఖరారు చేసింది. అయితే ఇంటి నిర్మాణానికి కేవలం 1.80 లక్షలు అందిస్తామని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఇంత తక్కువ మొత్తంలో నిర్మించే ఇళ్లకు నాణ్యత ఎలా ఉంటుంది..?? ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సిమెంటు ఇనుము రేట్లకు అనుగుణంగా ఒకసారి పోల్చితే కనీసం పునాది అయిన ఈ ధరలకు పూర్తి కావు అనేది నిపుణులు చెబుతున్న మాట. అంత తక్కువ మొత్తంలో లబ్ధిదారులకు ఇల్లు నిర్మిస్తే ఇది కూడా సగంలో ఆగిపోయింది మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని, ఈ పథకం కూడా మరో ముడి గోడ పాత్ర అవుతుందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అలాగే లబ్ధిదారుల అభిరుచికి అనుగుణంగా నిర్మించుకునే వెసులుబాటు లేకుండా ఒక ప్రైవేటు సంస్థకు, గుత్తేదారులకు అప్పగించడం వల్ల ఇల్లు నిర్మాణం పూర్తిగా అబాసుపాలు అవుతుందని జగన్ ఆశయం మొదట్లోనే నవ్వులపాలు అయ్యే అవకాశం ఉందని వైస్సార్సీపీ నాయకులే విమర్శలు చేస్తున్నారు. ఇంటి నిర్మాణం ఖర్చు విషయంలో మరోసారి జగన్ ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాలి.

author avatar
Special Bureau

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju