అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం..!!

2019 సంవత్సరానికి గాను కాగ్ రిపోర్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. ఇక గత సంవత్సరంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపీ 9.5 శాతం పెరగడం గమనార్హం. అంటే దాదాపు 9608 కోట్ల రూపాయలు పెరిగింది.

CAG report in Betul reveals scam of one crore rupeesఇక 2018-2019 వార్షిక రెవెన్యూ వ్యయం తో పోలిస్తే ఈ సంవత్సరం ఒక 1,28,570 కోట్ల రూపాయల రెవెన్యూ వ్యయం పెరిగింది. ఇది దాదాపు 6.7 శాతం అని తెలిపారు. అలాగే రెవెన్యూ జీఎస్పిడి కూడా గణనీయంగా 13.6 శాతం పెరిగింది. ఇకపోతే 14వ ఆర్థిక సంఘం సంక్రమానంతర లోటు గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం వారు నిర్దేశించిన పరిమితిని మించి ఉంది. గత సంవత్సరం ఇది 13,899 కోట్ల కన్నా ఎక్కువ కాగా జిఎస్డిపీ లో ప్రభుత్వ రుణ బకాయిలు నిష్పత్తి 27.59 గా ఉంది.

ఇక ఇప్పుడు వదిలిన రిపోర్టు గత బడ్జెట్ అంచనాల కన్నా 40,836 కోట్ల రూపాయలు తక్కువగా ఉండడం గమనించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సొంత పన్నుల రాబడి 58,031 కోట్ల రూపాయలు అని తెలిపారు. ఈ సంవత్సరం పన్నేతర రాబడి 4,396 కోట్లు కాగా గడిచిన సంవత్సరంతో పోలిస్తే 15.26 శాతం రాబడి పెరిగినట్లు తెలుస్తోంది గత సంవత్సరం రెవెన్యూ వ్యయం తో పోలిస్తే ఈ సంవత్సరం 7356 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం పెరిగింది. అలాగే గత సంవత్సరం కన్నా 6475 కోట్ల రూపాయలు క్యాపిటల్ వ్యయం పెరిగింది.