NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కరోనాపై కాకి కబుర్లు…!ఆరోగ్య శాఖ మంత్రి చేసిందేమిటి..??

ఏపీలో కరోనా కేసులు ఎంతగా విజృంభిస్తున్నాయో అందరం చూస్తున్నాము. ఏ రాష్ట్రంలో లేనంత పెరుగుదల ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. అసాధారణ స్థాయిలో రోజుకు పది వేలకు మించి కేసులు నమోదు కావడం ఆందోళన, ఆవేదన కలిగించే అంశం. కానీ ఈ విషయంలో ఏ మాత్రం పట్టనట్లు తన రొటీన్ భజన చేసుకుంటూ మన ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ మంత్రుల్లో అత్యంత కీలకమైన శాఖ నిర్వహిస్తూ ఏమాత్రం పట్టులేని మంత్రుల్లో ఆళ్ల నాని ముందు వరుసలో ఉంటారు. ఇతర రాష్ట్రాల్లో చూస్తే ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న మంత్రులకు ఆరోగ్యం పైన, వైద్య శాఖ పైన, వైద్య వృత్తి పైన ఎంతో కొంత అనుభవం అవగాహన ఉండే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎవరు ఊహించని విధంగా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని కి జగన్ ఉప ముఖ్యమంత్రి సహా ఆరోగ్య శాఖను కూడా కట్టబెట్టారు. ఆయన మంత్రి అయిన ఎనిమిది నెలలకే కరోనా రూపంలో ఓ పెద్ద ఉపద్రవం వచ్చిపడింది. మంత్రిగా తనను తాను నిరూపించుకోవడానికి ఇదే అవకాశం. సమీక్షలు చేయడం. క్షేత్ర స్థాయి పరిశీలించడం. ఆసుపత్రిలో వసతులు మెరుగుపరచడం. రోగులతో నేరుగా మాట్లాడటం. బాధితులకు ఎటువంటి అసౌకర్యాలు గురి కాకుండా చూడడం, ధైర్యాన్ని కల్పించడం, వైద్యులకు రక్షణ కల్పించడం ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రాధమిక విధులు ఇవన్నీ. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో ఆళ్ల నాని నిర్వహించి ఎరుగరు.

జిల్లాలో సమీక్షలు తప్ప అయన చేసింది ఏమిటి?

కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఆళ్ల నాని జిల్లాల మీద జిల్లాలు తిరుగుతున్నారు. ప్రతి జిల్లాలోను కలెక్టరేట్ లలో నామమాత్రంగా ఒక గంట గంటన్నర సమీక్షలు పెడుతూ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిని తనిఖీ చేస్తూ నామమాత్రంగా ముగించేస్తూ మమ అనిపిస్తున్నారు. ఆయన చీమంత పర్యటనను చాటంత రాస్తూ ఆయన పి ఆర్ ఓ లు మీడియాలకు పుంఖాను పుంఖాలుగా పంపిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. ఒక శాఖకు పూర్తిస్థాయిలో మంత్రిగా ఉన్న ఆయన కరోనా వచ్చిన రోగులతో, క్వారంటైన్ లో ఉన్న రోగులతో కనీసం ఫోన్ లో మాట్లాడి బాగోగులు తెలుసుకొని వాస్తవాలను తెలుసుకొని కష్టాలను తీర్చే ప్రయత్నం చేయలేదు. కనీసం ధైర్యం చెప్పిన ఎరుక లేదు. కేసులు అంతకంతకు అమాంతం పెరుగుతుంటే, కరోనా ఆరంభమైన కొత్తలో ఏమేమి చేసే వాళ్ళో ఇప్పుడు అదే చేసుకుంటూ ఏదో ఉన్నామూలే అనిపించుకుంటున్నారు. కనీసం వైద్యులకు పూర్తి స్థాయిలో పిపిఈ కిట్ లు అందించడంలో కూడా ఆ శాఖ మంత్రిగా ఆయన తన బాధ్యతను పూర్తిగా నిర్వహించలేక పోయారు. నిజానికి నాని వ్యవహార శైలి చూసినా, ఆయన నైజం చూసినా ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రజలకు ప్రాథమిక అవసరమైన ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్నప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకొని పూర్తిస్థాయిలో పట్టించుకుంటేనే ఇటు వంటి ప్రాణాంతక వైరస్ నుండి ధైర్యం కలిగినట్లు ఉంటుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు సీఎం జగన్ కరోనా పై సమీక్ష చేస్తున్నప్పుడు పక్కన కూర్చోవడం తప్పితే ఆళ్ల నాని సొంతంగా చేసిన సమీక్షలు గానీ, సొంతంగా తెచ్చుకున్న పేరు ప్రతిష్టలు గానీ ఏమీ లేవు.. కనీసం జిల్లా స్థాయిలో ఉన్న ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపర్చడం వంటి బాధ్యతలు కూడా పట్టించుకోలేదు. అందుకే నాని పనితీరుపై సొంత జిల్లాలోనే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏలూరులో లాక్ డౌన్ అమలులో ఎన్ని చిత్రాలో..

ఇక ఆళ్ల నాని సొంత నియోజకవర్గం ఏలూరుకు వస్తే చిత్ర విచిత్రాలు ఎన్నో కనిపిస్తున్నాయి. కరోనా కేసుల విషయంలోనూ, భాదితులకు అందించే వైద్యంలోనూ, లాక్ డౌన్ అమలులోనూ ఎన్నో చిత్రాలు చోటుచేసు కుంటున్నాయి. మే 14వ తేదీతో లాక్ డౌన్ రాష్ట్రం లో ఎత్తేసారు. జూన్ మొదటి వారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో స్థానిక పరిస్థితులను బట్టి లాక్ డౌన్ అమలు చేశారు.కానీ ఏలూరు లో మాత్రం విచ్చలవిడిగా దుకాణాలు తెరిచి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. ఒకానొక దశలో రోజుకి 600 నుండి 700 కేసులు నమోదు అయ్యే వరకు కూడా లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోలేదు. కానీ జూలై 13 తేది వచ్చేసరికి ఏలూరులో అనూహ్యంగా కేసులు పెరుగుదలతో ఇక జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారుల ఒత్తిడితో లాక్ డౌన్ అమలు చేయడం తప్ప లేదు. జూలై 13 నుంచి ఏలూరు లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కానీ జూలై ఒకటి నుంచి 13 వరకు కూడా జిల్లాల్లోనూ, ఏలూరు లోనూ కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. ఇలా ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గం ఏలూరులో కరోనా కట్టడి విషయంలో కావచ్చు, కరోనా పరీక్షల విషయంలో, రోగులకు అందుతున్న చికిత్సలనూ, ఆసుపత్రిలో సేవలోనూ కొత్తదనం చూపించలేక తన ముద్ర వేయలేక ఆళ్ల నాని ఎవరి నాని గానూ మిగలలేక పోయారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju

మంత్రివ‌ర్యా.. సాటి మ‌హిళా నేత‌పై యాంటీ ప్ర‌చారం ఎందుకు… మీ గెలుపుపై న‌మ్మ‌కం లేదా..!