ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా ఇటీవల ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశంపై ప్రారంభమైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పడిన హెల్త్ యూనివర్శిటీకి ఆయన మరణానంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హెల్త్ యూనివర్శిటీగా ఎన్టీఆర్ పేరు పెట్టారు. అప్పటి నుండి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా కొనసాగుతూ రాగా, వైఎస్ఆర్ హయాంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చారు. అయితే హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తీసి వేసి డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు చేస్తున్నారు.
హెల్త్ యూనివర్శిటీకి డాక్టర్ వైఎస్ఆర్ పేరు ఎందుకు పెట్టడం జరిగింది అనే విషయాన్ని ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ అసెంబ్లీలోనే వివరించారు. మంత్రులు అదే విషయాన్ని వల్లించారు. అయితే హెల్త్ యూనివర్శిటీకి ఒక దివంగత మాజీ సీఎం ఎన్ టీఆర్ పేరు ను తొలగించి మరో దివంగతం సీఎం వైఎస్ఆర్ పేరు పెట్టడం కరెక్టా..? కాదా..? అనే చర్చ అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజానీకంలో నూ జరుగుతోంది. అయితే రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం పథకాలకు, నిర్మాణాలకు పేరు మార్చడం జరుగుతూనే ఉంది. జాతీయ నాయకులైన మాజీ ప్రధానుల పేర్లను టీడీపీ హయాంలో తొలగించిన విషయాన్ని వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. వాళ్లు పథకాలకు పేర్లు మార్చడం తప్పు కాననప్పుడు ఇప్పుడు మారిస్తే తప్పు ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు హయాంలో ఇలాంటివి ఎప్పుడూ జరగనట్లుగా టీడీపీ వర్గీయులు మాట్లాడటాన్ని వైసీపీ ప్రశ్నిస్తొంది. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుకు ఇందిరా సాగర్ పేరు తొలగించడం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరుతో ఉన్న పథకానికి రాజీవ్ పేరు తీసేసి ఎన్టిఆర్ ఆరోగ్య శ్రీ పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హతే లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ‘నీవు నేర్పిన విద్యే నీరజాక్షా’ అన్నట్లు నాడు చంద్రబాబు చేసిందే ఇప్పుడు జగన్ చేశారనీ, అందులో తప్పు బట్టాల్సినంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
పూణే లో చాందినీ చౌక్ పాత వంతెనను ఇలా కూల్చేశారు..వీడియో వైరల్