ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రైతుల మహాపాదయాత్రకు పచ్చ జెండా ఊపిన హైకోర్టు.. పోలీసులపై కీలక వ్యాఖ్యలు

Share

అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అమరావతి నుండి అరసవెల్లికి వరకూ అమరావతి రైతులు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీ నుండి తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించగా, నిన్న విచారణ జరిపిన హైకోర్టు…సాయంత్రానికి పోలీసులు నిర్ణయాన్ని తెలియజేయాలని లేకుంటే శుక్రవారం ఉదయం మొదటి కేసులో ఈ పిటిషన్ ను విచారిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపి పోలీస్ బాస్ నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనీ, గతంలో అమరావతి నుండి తిరుపతి పాదయాత్ర సమయంలోనూ అమరావతి రైతులు షరతులు ఉల్లంఘించారని పేర్కొంటూ అనుమతిని నిరాకరించారు.

AP High Court relief orders to amaravati farmers

 

ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం .. అమరావతి రైతులు మహా పాదయాత్ర చేసుకోవచ్చని పేర్కొంది. అయితే 600 మంది పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. పాదయాత్రలో పాల్గొనే వారు పేర్లు తీసుకుని, వారికి ఐడీ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మరో పక్క పాదయాత్ర ముంగిపు రోజు బహిరంగ సభ అనుమతి కోసం ఇప్పుడే ధరఖాస్తు చేసుకోవాలని రైతులకు కోర్టు సూచిస్తూ, ఆ ధరఖాస్తును పరిశీలించాలని పోలీసులను ఆదేశించింది. పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది.

Read More: సుప్రీం కోర్టులో లక్ష్మీపార్వతికి షాక్ .. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

రాజకీయ నాయకులు వేల మందితో పాదయాత్ర చేసుకోవచ్చు కానీ ఆరు వందల మంది రైతులు పాదయాత్ర చేయకూడదా అని ప్రశ్నించింది. 600 మంది పాదయాత్రకు మీరెందుకు బందోబస్తు కల్పించలేరు అని ప్రశ్నించింది హైకోర్టు. జోడో యాత్ర రాష్ట్రాల మీదుగా జరుగుతుంటే అనుమతి ఇచ్చిన విషయాన్ని, ఢిల్లీలో సమస్యలపై వేలాది మంది ర్యాలీలు చేస్తుంటే అనుమతులు ఇచ్చి అక్కడ శాంతి భద్రతలను మెయింటెన్ చేస్తున్న విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. 35వేల మంది రైతుల్లో ఆరు వందల మంది రైతులు పాదయాత్ర చేస్తుంటే మీరు బందోబస్తు కల్పించలేరా అని హైకోర్టు ప్రశ్నించింది. రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మరళీధర్, వివి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.

Read More: అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనుమతి నిరాకరించిన ఏపి పోలీస్ బాస్ .. ఇవీ కారణాలు


Share

Related posts

లిప్ లాక్.. అమ్మ ఒప్పుకుంటేనే ..?

GRK

Bigg Boss 5 Telugu: ఈసారి సీజన్ మొత్తానికి ఆమెదే మాస్టర్ మైండ్ అంటున్న జనాలు..!!

sekhar

Suicide:పెళ్లి ఇంట చావు బాజా…! వరుడు చేసిన ఈ పనికి రెండు కుటుంబాల్లో విషాదం..!!

somaraju sharma