స్థానికంలో జగన్ ఎత్తులు అవే…!

Share

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సమరంలో బిసి మంత్రం ఏ రాజకీయ పార్టీకి లాభిస్తుంది?, వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల వ్యూహానికి టిడిపి భయపడుతున్నాదా? రాజకీయ పార్టీల ఎత్తులు, పై ఎత్తులపై విజయం సాధించేది ఎవరు? అనే విషయాలు రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలో ఒకే సారి స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకు రావడం ప్రధాన ప్రతిపక్షానికి కొంత ఇబ్బందికరంగా మారిందనే మాటలు వినిపిస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు మాటల్లోనూ ఆ విషయం ధ్వనిస్తోంది.

తక్కువ సమయంలో ఎంపిటిసి, జడ్‌పిటిసి, మున్సిపల్ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. 20 రోజుల వ్యవధిలోనే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు తప్పుబడుతున్నారు. ఎన్నికల్లో రిజర్వేషన్‌లను ఇష్టానుసారంగా ప్రకటించారనీ, షెడ్యూల్, నోటిపికేషన్ ఒకే సారి ఎలా ఇస్తారనీ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత గజిబిజిగా ఎన్నికలు నిర్వహించలేదని ఆయన అంటున్నారు. ఎన్నికల్లో నిఘా పెట్టే బాధ్యత ఎన్నికల కమిషన్‌దే కానీ ప్రభుత్వానిది కాదని చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల నిఘా యాప్‌కు ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? అసలు ఇంత త్వరగా ఎన్నికలు నిర్వహించడంలో అంతర్యమేమిటి? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత అనేది తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా నష్టం కలిగిస్తుందని ఆందోళన చెందుతున్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వైసిపి వారికి కావాల్సిన గ్రామాల్లో ఎదో ఎక విచారణ చేపట్టి ఉద్దేశ పూర్వకంగా గెలిచిన అభ్యర్థిపై అనర్హత వేటు వేసే వీలుంటుందని టిడిపి భయపడుతోంది. ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి. తన నియోజకవర్గంలో టిడిపి పోటీయే చేయడం లేదని ఆయన అస్త్రసన్యాసం చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లడం ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయడానికే అన్న అభిప్రాయాన్ని బిజెపికి చెందిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందీశ్వరి కూడా వ్యక్తం చేయడం గమనార్హం.


స్థానిక ఎన్నికల విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారనీ అందులో భాగంగానే అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలకు ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేశారన్న మాట వినిపిస్తున్నది. సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాలను కైవశం చేసుకున్న వైసిపి పూర్తి జోష్‌లో ఉండి స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఫేస్ చేసి ప్రభుత్వం అమలు చేసిన నవరత్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి లబ్దిపొందాలని చూస్తున్నది. దీనికి తోడు పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటు కూడా అన్ని ప్రాంతాల్లో లాభిస్తుందని వైసిపి నేతలు ధీమాతో ఉన్నారు.

అయితే ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు, రాజకీయ కక్షసాధింపు వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నా అధికార పార్టీకి ధీటుగా వ్యవహరించే నాయకత్వం చాలా ప్రాంతాల్లో కొరవడిందనే మాట వినిపిస్తున్నది. పలువురు సీనియర్ నేతలే కొరివితో తలగొక్కోవడం ఎందుకని మిన్నకుండిపోతున్న తరుణంలో పార్టీ కోసం కష్టపడి పని చేసే క్యాడర్‌ కూడా నిరుత్సాహానికి గురి అయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు.

మరో పక్క అధికార ప్రతిపక్ష పార్టీలు బిసి మంత్రాన్ని జపిస్తున్నాయి. నిబంధనల మేరకు గతంతో పోల్చుకున్న బిసి రిజర్వేషన్‌ సీట్లు తగ్గినప్పటికీ తగ్గిన సీట్లు భర్తీ చేసే విధంగా ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు జనరల్ స్థానాలలో బిసిలకు సీట్లు కేటాయించాలని నిర్ణయించాయి. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక పోరులో ప్రధాన పోటీ అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి మధ్యనే ఉన్నా బిజెపి, జనసేన కూడా ఉమ్మడి అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా దింపుతుండటంతో త్రిముఖ పోరులో ఎవరు ఎక్కువ స్థానాలు కైవశం చేసుకుంటారో వేచి చూడాలి.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

12 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago