NewsOrbit
Right Side Videos రాజ‌కీయాలు

మంత్రి దేవినేని ఉమా సోదరుడు వైసిపిలో చేరిక

అమరావతి, మార్చి 11 : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సోమవారం వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. మైలవరం నియోజకవర్గ వైసిపి ఇన్‌చార్జి వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌తో కలిసి దేవినేని చంద్రశేఖర్ సోమవారం జగన్మోహనరెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా జగన్మోహనరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వనించారు.

దేవినేని చంద్రశేఖర్ 2012లో వైసిపిలో చేరి ఆరు నెలల పాటు ఉన్నారు. అనంతరం మంత్రి ఉమామహేశ్వరరావు , కుటుంబ సభ్యుల వత్తిడితో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. నేడు వసంత కృష్ణప్రసాద్ ద్వారా మళ్లీ వైసిపిలోకి చేరారు. అనేక కారణాల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని ఈ సందర్భంగా చంద్రశేఖరరావు తెలిపారు. వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రావణుడి లంక నుండి విభీషణుడు బయటకు వచ్చినట్లుగా అబివర్ణించారు.

నిత్యం ప్రధాన ప్రతిపక్షం వైసిపి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసిపి తీర్థం పుచ్చుకోవడం ఆ పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

Leave a Comment