NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఆ జిల్లాలో మంత్రి వర్సెస్ ఎంపీ..!

నరసాపురం వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఎలా మలుపులు తిరుగుతున్నదో అందరికీ తెలిసిందే. అతనిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీల బృందం వెళ్లి స్పీకర్ ను కలిశారు. ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరో వైపు ఎంపి రాజు గారు మాత్రం తన ఫందాను వీడటం లేదు. పార్టీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే రాజు గారిని పార్టీ నుంచి అలాగే పార్లమెంట్ నుంచి ఒకే సారి బయటకు పంపేందుకు వైసీపీ పెద్ద ఎత్తున వ్యూహ రచన చేస్తోంది. దానిలో భాగంగానే ఎంపిల బృందం.. న్యాయ నిపుణులతో చర్చించి వెళ్లి లోక్ సభ స్పీకర్ ఓం బిల్లా కు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో మంత్రి శ్రీరంగనాథరాజుకి, ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అదే క్రమంలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వీరందరికీ అందరికీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఏమాత్రం పొసగడం లేదు. దీంతో జిల్లాలో పోలీసులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రఘురామ కృష్ణంరాజు కు కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయని జిల్లాలో మాటలు వినిపిస్తుండటంతో జిల్లా స్థాయి అధికారులు కూడా రెండు వైపులా వత్తిళ్లు వస్తున్నాయని భయపడుతున్నారు. రఘురామ కృష్ణం రాజు ఇటీవల జిల్లాలో కీలక అధికారులను కలిసి బిజెపి పెద్ద నుంచి ఫోన్ చేయించారని, తన మాట నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పుకార్లు వస్తున్నాయి. దీంతో పోలీసులపై ఒత్తిళ్లు పెరిగాయి. తాజాగా మంత్రి పిఏ రఘురామ కృష్ణం రాజు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కోర్టులో తేల్చుకోవాలని చెప్పడం గమనార్హం. మంత్రి శ్రీరంగనాధ రాజు పై ఎంపీ రఘురామకృష్ణంరాజు అమర్యాదకరంగా, అసభ్యకరంగా మాట్లాడారని అతనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పిఏ ఫిర్యాదు చేశారు. దాన్ని పోలీసులు పట్టించుకోకుండా కోర్టు కు వెళ్లాలని సూచించడంతో జిల్లాల్లో మంత్రికి, ఎంపికి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇవి చుట్టూ తిరిగి అధికార పార్టీకి, అధికారులకు మధ్య నలిగి పోతున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju