ఈ కేసు ఎన్ఐఏకి అవసరమా

Share

అమరావతి, జనవరి 6: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి కేసు దర్యాప్తు విషయంపై ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.  హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకి అప్పగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు వారితో మాట్లాడారు. ఈ కేసులో ఎన్ఐఏ విచారణ అవసరం లేదనీ, ఈ మేరకు కేంద్రం నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయాలనీ నిర్ణయించారు. సిట్ విచారణ జరుపుతున్న కేసును కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులను సలహాలు అడిగారు. ఈ సమావేశంలో డీజీపీ ఆర్‌పి ఠాకూర్, ఏజీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్లొన్నారు.


Share

Related posts

సండే బ్రేకింగ్ న్యూస్: ఢిల్లీ సాక్షిగా విజయ సాయి రెడ్డికి బిగ్ బ్యాడ్ న్యూస్?

CMR

బోటు ప్రమాదంపై సుప్రీంలో పిటిషన్

somaraju sharma

Kajal agarwal: సొంత బిజినెస్‌లో కాజల్ అగర్వాల్(Kajal agarwal)..నిర్మాతగా సక్సెస్ అవుతుందా..?

GRK

Leave a Comment