AP Political Survey: సర్వేలూ – సత్యాలూ..!? వైసీపీలో అలెర్ట్ – అలజడి..! 4 నెలలు – 4 సర్వేలు..!

YSRCP:
Share

AP Political Survey: ఏపీ (Andhra Pradesh) లో ఇప్పటికిప్పుడు ఎన్నికలెం లేవు.. కానీ పొలిటికల్ సీజన్ మొదలయింది. సర్వేలు (AP Politics) మొదలయ్యాయి. ప్రైవేటు ఏజెన్సీలు, మీడియా సంస్థలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, పార్టీల సంస్థలు అన్ని ప్రజల్లో వాలిపోయి రకరకాల సర్వేలు చేస్తున్నాయి.. వాటిలో ఈ మధ్య బాగా జనంలో చర్చకు దారి తీసినవి మాత్రం నాలుగు సర్వేలే.. మూడు నెలల కిందట వచ్చిన కేంద్ర నిఘావిభాగం సర్వే.. రెండు నెలల కిందట వచ్చిన ఆత్మసాక్షి సర్వే.., రెండు వారాల కిందట సీఎం జగన్ చేతికి అందిన పీకే టీమ్ (Prasanth Kishore) సర్వే.. రెండు రోజుల కిందట బయటకు వచ్చిన సి ఓటర్ సర్వే..! వాటిలో ఒక కామన్ పాయింట్ మనం పరిశీలిస్తే వైసీపీ పట్ల వ్యతిరేకత. ఈ నాలుగు సర్వేల్లో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు, ప్రభుత్వ వ్యవహారాల పట్ల జనంలో వ్యతిరేకత ఉండడం పార్టీని కలవరపెడుతున్న అంశం..!

AP Political Survey: ఒక్కోటీ ఒక్కోలా.. కానీ.. ఒకే సంఖ్య..!!

* వీటిలో ఆత్మసాక్షి అనే సర్వేని పక్కన పెట్టేద్దాం.. ఇది ఒక కొత్త ఏజెన్సీ. వాళ్ళు సర్వే నిర్వహించిన విధానంలో హేతుబద్ధత లేదు. సరైన సిస్టం లేదు. సరైన పారదర్శకత లేదు. కనీసం ప్రెజెంటేషన్ కూడా సక్రమంగా లేదు. ఈ సర్వేలో జగన్ ఇప్పటికిప్పుడు 46 స్థానాలు కోల్పోతారని.., 11 మంది మంత్రులు కూడా ఓడిపోతారని ఇచ్చారు. కానీ దీన్ని చెత్తబుట్టలో వేయడం మంచిది..!

AP Political Survey: 4 Months - 4 Surveys Against YSRCP
AP Political Survey: 4 Months – 4 Surveys Against YSRCP

* రెండోది కొంచెం నమ్మాల్సిన.. కాస్త అనుమానాలు రేకెత్తిస్తున్న కేంద్ర నిఘా వర్గాల సర్వే అనేది.. ఇది ప్రతి ఆరునెలలకోసారి ప్రకడ్బందీగా జరుగుతుంది. ఏపీలో ఈ ఏడాది జులైలో జరిగిన సర్వేలో వైసీపీ వ్యతిరేక ఫలితాలు వచ్చాయట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ దాదాపు 50 స్థానాలకు పైగా కోల్పోవడం ఖాయమని చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత శాతాలు, లెక్కలు కూడా ఇచ్చారు.. జిల్లాల వారీగా కూడా జాబితా ఇచ్చారు. ఇది వైసీపీని కలవర పెడుతున్న అంశం. ఈ సర్వే కాస్త పద్ధతి ప్రకారమే జరుగుతుంది..

* మూడోది ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వే.. అంటే జగన్ సొంత టీమ్ సర్వే అనుకోవచ్చు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 51 స్థానాలు ఓడిపోవడం ఖాయమంటూ ఈ సర్వే లో కూడా తేలిందని సమాచారం. ఇది అత్యంత పకడ్బందీగా జరుగుతుంది. జగన్ పూర్తిస్థాయిలో నమ్మే సర్వే ఇది. దీనిలో ప్రశ్నలు, సమాధానాలు అన్నీ ఒకటికి రెండుసార్లు ప్రొఫెషనల్స్ పరిశీలించి తుది జాబితా అందిస్తారు. సో.., దీనిలో జగన్ కి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు.

AP Political Survey: 4 Months - 4 Surveys Against YSRCP
AP Political Survey: 4 Months – 4 Surveys Against YSRCP

ఇది లేటెస్ట్.. సి ఓటర్..!

ఏఎన్ఏస్ – సీ ఓటర్ (ANS -C Voter) సంస్థలు సంయుక్తంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతిష్టాత్మక సర్వే ఫలితాలను రిలీజ్ చేసింది. ఈ ఫలితాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర పనితీరు, ఏపిలో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుకు అద్దం పడుతోంది.ఏఎన్ఏస్ – సీ ఓటరు సర్వే దేశ వ్యాప్తంగా సర్వే ఫలితాలు వెల్లడించడంలో ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని పేరు ఉంది. వీళ్లు రెండు కోణాల్లో సర్వే చేశారు. ఏమ్మెల్యేల పనితీరుపై ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎంత మేర ఆగ్రహంతో ఉన్నారు అనేది ఒకటవ అంశం అయితే రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రజలు ఏ మేరకు ఆగ్రహంతో ఉన్నారు అంటే సీఎంల మీద ప్రజాగ్రహం ఎలా ఉంది అనేది రెండవ అంశంగా సర్వే చేశారు. ఈ అంశాలపై సర్వే చేసి ఆ సర్వే ఫలితాలు బయటపెట్టారు. ఇది ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశమే, మనం తేరుకోవాలి, జాగ్రత్త పడాలి, అప్రమత్తం అవ్వాలని వైసీపీ మార్పులు చేసుకుంటుందా అనేది చూడాలి..!

ఆ విషయాల్లో ఏపీనే మొదటిస్థానం..!!

ఎక్కువ ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఏపి మొదటి స్థానంలో ఉందట. ఏపిలో ఎమ్మెల్యేల పనితీరు పట్ల 28.5 శాతం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆ సర్వే రిపోర్టు చెబుతోంది. ఇది దేశంలోనే చాలా వరెస్ట్ అని భావించాల్సి వస్తోందట. రెండవ స్థానంలో గోవా ఉంది. గోవాలో ఎమ్మెల్యేల పనితీరు పట్ల 24.3 శాతం అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారట. మూడవ స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేల పనితీరు పట్ల 23.5 శాతం ప్రజాగ్రహం ఉంది. ఇక ఎమ్మెల్యేల పనితీరుపై సంతృప్తి (బెస్ట్) వ్యక్తం చేస్తున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో కేరళ ఉంది. ఈ రాష్ట్రంలో కేవలం 6.8 శాతం మాత్రమే ప్రజాగ్రహం ఉంది. అదే విధంగా గుజరాత్ లోని ఎమ్మెల్యేల పనితీరుపై 7.4 శాతం మాత్రమే ప్రజాగ్రహం ఉన్నట్లు వెల్లడించింది. మహరాష్ట్రలో ఎమ్మెల్యే ల పనితీరు చూసుకుంటూ 7.9 శాతం ఆగ్రహం ఉన్నట్లు తెలియజేసింది. ఈ నివేదిక ప్రకారం కేరళ, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు బెస్ట్ ఆఫ్ త్రీలో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే పనితీరుపై పెద్దగా ప్రజాగ్రహం లేదుట. ప్రజాగ్రహం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపి, గోవా, తెలంగాణ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
* రాష్ట్రాల సీఎంల పనితీరుపై నిర్వహించిన సర్వేలో ఎక్కువ శాతం మంది ఓటర్లు ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రుల్లో తొలి వరుసలో తెలంగాణ సీఎం కేసిఆర్ ఉన్నారు. కేసిఆర్ మీద రాష్ట్రంలో 30 శాతం మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారుట. రెండవ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఆయన పట్ల 28.4 శాతం మంది ఆగ్రహంతో ఉన్నట్లు సర్వే రిపోర్టు తెలియజేస్తోంది. ఇక మూడవ స్థానంలో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నారు. జగన్మోహనరెడ్డి పట్ల 25 శాతం ప్రజాగ్రహం ఉన్నట్లు సదరు సర్వే సంస్థలు తెలిపాయి.  సీ ఓటర్ సంస్థలు ఏ రాజకీయ పార్టీకి అనుకూలమో వ్యతిరేకమో కాదు. వారు తమ సర్వేని పకడ్బందీగా నిస్పక్షపాతంగా నిర్వహిస్తుంటాయి. అందుకే ఈ సర్వే సంస్థలకు జాతీయ స్థాయిలో ఓ బ్రాండ్ ఉంది. కావున ఏపి సీఎం వైఎస్ జగన్ అప్రమత్తం కావాల్సిందే..!


Share

Related posts

Bandi Sanjay: బండి సంజ‌య్ వ‌ర్సెస్ కేటీఆర్‌.. ట్విట్ట‌ర్లో కొత్త యుద్ధం

sridhar

ఆమె పేరు చెప్తే కే‌సి‌ఆర్ తో పాటు టోటల్ టి‌ఆర్‌ఎస్ పార్టీ ఉలిక్కిపడుతోంది .. !? 

sekhar

Pavan Kalyan: జనసేనాని.. ఇలాంటి రాజకీయం చేయాలంటే ఇంట్లో పడుకోవడం మేలు..!!

Srinivas Manem