NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Politics: రాజ్యసభలో చిరంజీవి X పవన్ కళ్యాణ్..! ఈ రెండు పుకార్లు.. రెండు కళ్ళతో చూడాల్సిందే/ చదవాల్సిందే..!!

AP Politics: Best Gossip but Interesting Facts

AP Politics: ఈ రెండు, మూడు రోజుల నుండి తెలుగు మీడియాల్లో.., తెలుగు సినీ, పొలిటికల్ సర్కిళ్లలో రెండు పుకార్లు విపరీతంగా తిరిగేస్తున్నాయి..! ఇవి నిజమైతే తెలుగు రాజకీయంలో ఒక పెద్ద సంచాలనమే.. అవి ఎంత వరకు నిజమో మనం నిర్ధారించం.., ఆ విషయాలను కొట్టి పారేయలేం.. కానీ వాటిలో సాధ్యాసాధ్యాలను మూలాల్లోకి వెళ్లి విశ్లేషిస్తాం..! ఆ పుకార్లు – వార్తలు – నిజాలు ఏమిటో “న్యూస్ ఆర్బిట్” స్పెషల్ విశ్లేషణ చూద్దాం..!

AP Politics: పుకారు నంబర్ వన్ – రాజ్యసభకు పవన్ కళ్యాణ్ (బీజేపీ కోటాలో)..!

జనసేన అధినేత.., పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజ్యసభకు వెళ్ళబోతున్నారనేది మొదటి పుకారు. బీజేపీ కోటాలో యూపీ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించి, కేంద్రంలో మంత్రి పదవిని కూడా చేపట్టబోతున్నారని ఒక వార్త.. ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటుంది. అందుకే జనసేనతో జతకట్టింది. కానీ ఏపీలో బీజేపీ ఆశించిన ఓట్లు దక్కడం లేదు. వారికి బాగా తెలిసిన హిందూ రాజకీయం ప్రయోగించినా తిరుపతి లాంటి చోట్ల కూడా బీజేపీ పప్పులు ఉండకలేదు.. అందుకే ఏపీలో మతం కంటే కుల రాజకీయాలే మంచిదని భావించిన బీజేపీ పవన్ కళ్యాణ్ కి కేంద్రమంత్రి ఇవ్వడం ద్వారా కాపు సామజిక వర్గ ఓట్లు, పవన్ అభిమానగానాన్ని ఆకర్షించాలని చూస్తుంది అనేది ఒక లోతైన అంశం. దీన్ని కొట్టిపారేయలేము. కానీ..

Read it: మన్సాస్ ట్రస్టులో అశోక్ గజపతికి పెద్ద సవాళ్లు ఇవే..!

AP Politics: Best Gossip but Interesting Facts
AP Politics Best Gossip but Interesting Facts

రాజకీయంగా స్థిరంగా లేకుండా.. సినిమాల్లో బిజీ అయిపోతూ.., అటూ, ఇటు రెండు పడవల ప్రయాణం చేస్తున్న పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరిస్తారా..!? అనేదే పెద్ద ప్రశ్న. ఒకవేళ అదే జరిగితే అన్నయ్య చిరంజీవి లాగా ఫేడ్ అవుట్ అయిపోయినట్టే. రాజ్యసభ, ఎమ్మెల్సీ అనేది ప్రత్యక్ష రాజకీయాలు చేయలేని, గెలవలేని, ప్రజాసంబంధాల లేని నాయకులకు బాగుంటుంది.. ఒకసారి ఆ హోదా ఊబిలో పడిపోతే ప్రజాసంబంధాల తెగిపోయినట్టే. అందుకే చిరంజీవి దెబ్బతిన్నారు. సో.. అదే పొరపాటు పవన్ కళ్యాణ్ చేస్తే జనసేన దుకాణం సర్దుకోవాల్సిందే. ఈ విషయం పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసు. తెలిసీ తెలిసీ తప్పటడుగు వేయబోరని ఆశిద్దాం..! లేకపోతే, పదవీ మోజు ఉంటె ఇక ఆయన ఇష్టం..!

AP Politics: Best Gossip but Interesting Facts
AP Politics Best Gossip but Interesting Facts

పుకారు నంబర్ టూ.. రాజ్యసభకు చిరంజీవి..!!

మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు అనేది రెండో పుకారు.. వైసీపీ కోటాలో రాజ్యసభకు ఎన్నికై.. ఏపీలో వైసీపీకి తన ఓటు బ్యాంకుని గిఫ్టులుగా ఇవ్వనున్నారనేది ఒక చక్కర్లు కొడుతున్న అంశం. ఏపీలో వైసీపీకి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమి లేదు.. కాపుల ఓట్లు కూడా బలంగానే జగన్ తోనే ఉన్నాయి. కానీ… వచ్చే ఎన్నికల నాటికి జనసేన – టీడీపీతో పొత్తు పెట్టుకుని కాపుల ఓట్లపైనా.. ఆ 35 నియోజకవర్గాలపైనా గట్టిగా ఫోకస్ పెట్టేశాయని జగన్ దగ్గర పక్కా సమాచారం ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు, పొత్తు, రాజకీయం, వ్యాఖ్యలు మొత్తం మొదటి నుండి జగన్ కి తీవ్ర వ్యతిరేకమే. అందుకే చిరంజీవికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా టీడీపీ – జనసేన ఉమ్మడి ప్రణాళికకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు..అనేది ఒక లోతైన అంశం.. కానీ…

Must read it: ఓటీటీల్లో బూతులు.. బిజినెస్ మార్గాలు..!

AP Politics: Best Gossip but Interesting Facts
AP Politics Best Gossip but Interesting Facts

చిరంజీవీ ఇప్పుడు రాజకీయంగా ఫెడ్ అవుట్ అయిపోయారు. సినిమాల్లో బిజీగా ఉన్నారు. పూర్వపు స్టెప్పులేసుకుని, కుర్ర హీరోయిన్లతో ఆడిపాడుతున్నారు. రాజకీయంగా తాను మూటగట్టుకున్న అపఖ్యాతిని సినిమాల ద్వారా పూడ్చుకోవాలని చూస్తున్నారు. కానీ ఈ సమయంలో మళ్ళీ మెగాస్టార్ రాజకీయాల్లోకి ప్రవేశించి వైసీపీ కి మద్దతుగా నిలుస్తారన్న పుకార్లలో అర్ధం ఉందా..!? కాకపోతే చిరంజీవి జగన్ కి వ్యతిరేకి కాదు, పైగా జగన్ తండ్రి దివంగత వైఎస్ నుండీ చిరంజీవి ఈ కుటుంబంతో జాగ్రత్తగానే డీల్ చేస్తూ వస్తున్నారు. అందుకే అవకాశాలను కొట్టిపారేయలేం.. సో.. చూద్దాం రాజ్యసభ, కేంద్రమంత్రి చేసేసిన చిరంజీవి మళ్ళీ జగన్ కోసం రాజ్యసభ తీసుకుని తన ఛరిష్మాన్ని తాకట్టు పెడతారేమో చూద్దాం..! కానీ ఈ గేమ్ చంద్రబాబుకి పెద్ద ఎదురు దెబ్బె..!

(రెండు పుకార్లు – వాటి నిజాలు – సాధ్యాసాధ్యాలూ చూసాం. ఇక ఈ నిర్ణయాలు నిజమో కాదో తెలియాలి అంటే మరో ఆరు నెలలు ఆగాల్సిందే. వచ్చే ఫిబ్రవరికి గానీ రాజ్యసభలు ఖాళీ అవ్వవు. అప్పటికి వైసిపి రాజ్యసభ సభ్యుల బలం 9 కి పెరగనుంది. ఇప్పుడున్న ఆరుగురిలో ఒకరు (విజయసాయిరెడ్డి) పదవీకాలం అయిపోతుంది. టీడీపీ ఖాతా నుండి బీజేపీలో కొనసాగుతున్న సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ ల పదవీ కాలం అయిపోతుంది. ఈ నాలుగు వైసిపికే దక్కనున్నాయి. అందులో ఒకటి విజయసాయికే \మళ్ళీ ఇవ్వనున్నారు. మిగిలిన మూడు రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి..!

author avatar
Srinivas Manem

Related posts

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?