(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రోజుకొక ట్వీట్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించే విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నానీ తాజాగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా పార్లమెంట్ ఉభయసభల్లో పార్టీ ఎంపీలతో వోటు చేయించిన జగన్ నిన్న కడపలో తమ పార్టీ జాతీయ పౌరసత్వం జాబితాకు వ్యతిరేకమని ప్రకటించారు.
జగన్ యుటర్న్పై స్పందించిన కేశినేని ‘నువ్వు సూపర్ అన్న’ అంటూ వ్యంగ్యబాణం సంధించారు. ‘కేసుల మాఫీ కోసం ఎంపీలతో సిఎబికి అనుకూలంగా వోటు చేయిస్తావు, ముస్లింల వోట్ల కోసం ఎన్ఆర్సికి వ్యతిరేకమంటావు. ఏదైనా నీకే చెల్లిందన్నా, నీకు హాట్సాఫ్ అన్నా’s అంటూ కేశినేని ట్వీట్ చేశారు.
జగనన్న @ysjagan నువ్వు సూపర్ అన్న. కేసుల మాఫీ కోసం నీ ఎంపీలతో @YSRCParty CAB కు అనుకూలంగా ఓటేపిస్తావు. ముస్లింల ఓట్ల కోసం NRC కి వ్యతిరేకమంటావు. ఏదయినా నీకే చెల్లిందన్న. హ్యాట్సాఫ్ అన్నా pic.twitter.com/5YrZou2AOm
— Kesineni Nani (@kesineni_nani) December 24, 2019