NewsOrbit
Featured టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

3 రాజధానులు..!33 సమస్యలు.. !!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్లుగా ఏపికి మూడు రాజధానులు వచ్చేస్తున్నాయి. సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంతో ఒక అంకం పూర్తి అయ్యింది. కోర్టు వ్యవహారాలు ఎలా ఉన్నా.. పరిపాలనా వ్యవస్థ ను విశాఖ కు తరలించడానికి ప్రభుత్వం చకచెకా అడుగులు వేస్తున్నది. ఆగస్టు 15 నుండే దశల వారీగా సచివాలయ కార్యకలాపాలు విశాఖకు తరలించనున్నారు.

జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. అయితే పరిపాలన, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఒకే చూట కాకుండా మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల వచ్చే కష్ట నష్టాల గురించి ఒ సగటు వ్యక్తి వ్యక్తం చేసిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందేమా చూద్దాం.

ఒ సగటు వ్యక్తి డౌట్ ఏమిటంటే మూడు రాజధానుల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఉపయోగం ఏమిటి?, శాసన, పాలన, న్యాయ వ్యవస్థలు ఒకే ప్రాంతంలో పెట్టుకొని రాజధానిగా చేసుకొని.. మిగిలిన అన్ని ప్రాంతాలను వివిధ రకాల హబ్ ల ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చు కదా?. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం వల్ల శాసన రాజధాని అమరావతి నుండి పరిపాలన రాజధాని విశాఖకు వెళ్లాలంటే 300 కిలో మీటర్లు ప్రయాణించాలి. అదే విధంగా పరిపాలన రాజధాని విశాఖ నుండి న్యాయ రాజధాని కర్నూలు కు వెళ్లాలంటే 700 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.

ఇలా ప్రయాణాలకు ఎంత డబ్బు, ఎంత సమయం వృధా అవుతుందో గమనించారా మరి. ఉదాహరణకు తీసుకుంటే..పరిపాలన రాజధాని నుండి ఒ విభాగ హెచ్ఒడి వారి సిబ్బందితో కోర్టు పనిమీద (వాయిదాలకు) కర్నూలు హైకోర్టుకు వెళ్లి రావాలంటే అటూ, ఇటూ ప్రయాణానికి 24 గంటలు సమయం, వాహనాలకు కనీసం లక్ష ఖర్చు అయ్యే పరిస్థితి. అదే విధంగా విశాఖ నుండి శాసనసభ నిమిత్తం అమరావతి వచ్చి, మళ్ళీ వెళ్లాలంటే 18 గంటల సమయం, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు తప్పదు. ఈ పరిస్థితిలో ఖర్చు ఎలాగూ తప్పదు కాబట్టి ప్రభుత్వం తరపున అన్ని శాఖలకు ఒక్కో ‘హెలికాఫ్టర్’ కొనుగోలు చేసి ఇచ్చేస్తే అప్పుడు ప్రయాణ భారం తగ్గడంతో పాటు సమయం, ఖర్చు కలిసి వస్తాయని అంటున్నారు సెటైరిటికల్ గా!

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju