NewsOrbit
రాజ‌కీయాలు

కొడాలి నానికి జగన్ మధ్య దూరం పెంచిన ఆ నేత ఎవరు?

టీడీపీ అధినేత చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ లపై తరచూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారని మాట వినిపిస్తోంది. తరచూ టీడీపీ నాయకులను బూతులతో తిడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే కొడాలి ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉన్నారో ఎవరికి అర్ధం కావడం లేదంట.

కొడాలి నాని గుడివాడ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. ఊహించని విధంగా ఆయనకి జగన్ మంత్రి వర్గంలో అత్యంత కీలకమైన పౌర సరఫరాల శాఖ వరించింది. ఇటీవల వైకాపాలోని సీనియర్ లు కొందరు ఆయన ను పక్కన పెడుతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా ఆయన మంత్రిత్వ శాఖకి సంబందించిన రివ్యూ సమావేశం కూడా మరో మంత్రి నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకి, పార్టీ అధిష్టానానికి కాస్త గ్యాప్ వచ్చిందని, పార్టీ అధిష్టానానికి ఆయనకు గ్యాప్ పెట్టేలా కొందరు పావులు కదిపారని వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది.

కొడాలి నానిని పక్కకు పెడితే అదే సామాజికవర్గానికి చెందిన మైలవరం నుంచి దేవినేని ఉమాపై విజయం సాధించిన వసంత కృష్ణ ప్రసాద్(కేపీ)ని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ అధిష్టానంలోని కీలక నేతలతో కేపీకి వ్యాపార సంభంధమైన మితృత్వం కూడా ఉందని, కేపీని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు సిఎం వైఎస్ జగన్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు అని అందుకే ఇప్పుడు నానీని పక్కన పెడుతున్నారు అని అంటున్నారు.

త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఈ మార్పు జరగవచ్చని తెలుస్తుంది. నానీ పని తీరు విషయంలో సిఎం వైఎస్ జగన్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆయనను పక్కన పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. నాని ఆయన జిల్లాలో జరిగిన సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొనడం లేదని అంటున్నారు.

నాని బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా పేరుంది. టిడిపికి కంచుకోట అయిన గుడివాడ నియోజక వర్గం నుండి నాలుగు సార్లు విజయం సాధించారు. సీఎం జగన్ కి ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటున్నారు. అయితే ఆయనకి, పార్టీకి మధ్య గ్యాప్ పెరగటానికి కారణం ఎవరో, ఏమిటో? మీకు తెలుసా? గెస్ చేయండి!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju