అసెంబ్లీపై కన్నేసిన ఆంధ్రా ఎంపీలు!

Share


ఆంధ్ర పార్లమెంట్ సభ్యులు శాసన సభకు పోటిచేయడానికి ఉత్సుకత చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గల్లా జయదేవ్, కర్నూల్ పార్లమెంట్ వైసీపీ పార్టీ నుండి విజయం సాధించిన బుట్టరేణుక తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో పార్లమెంట్ నుంచి కాకుండా శాసనసభ నుంచి పోటిచేయాలని భావిస్తున్నారు.రాజకీయ అనుభవం లెకుండానే పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించి విజయం సాధించారు.

ఇటీవల పార్లమెంట్‌లో ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని మోడీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో జయదేవ్ ఇంగ్లీష్ లో,రామోహన్‌నాయుడు హిందీలో ప్రసంగించి చంద్రబాబు దృష్టిలో పడ్డారు. జయదేవ్,రామ్మోహన్ నాయుడు కుటుంబాలకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటం గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకూమారి అనేక రాజకీయ పదవులను అలంకరించారు. కింజారపు రామ్మోహన్ నాయుడు తండ్రి కింజారపు ఎర్రనాయుడు కూడా అనేక రాజకీయ పదవులను నిర్వహించారు. తెలుగుదేశంపార్టీ సినియర్ లిడర్లలో ఆయన ఒకరు. ఇప్పటికే రామ్మోహన్ నాయుడు బాబాయి అచ్చెనాయుడు చంద్రబాబు క్యాబినేట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

బుట్టా రేణుక కర్నూల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఎమ్మిగనూర్‌ నుంచి పోటిచేయడానికి ఉత్సుకత చూపుతున్నారు. ఇక్కడి నుంచి శాసనసభ సభ్యునిగా విజయంసాధించిన ­­­­­­­­జయనాగేశ్వరరెడ్డి ఈ సీటు వదుకోవడానికి సిద్దంగా లేరు. చంద్రబాబు నాయుడు బుట్టా రేణుక ఒప్పందం ప్రకారమే తెలుగుదేశం పార్టీలో చెరిందా మెదట భర్తను తెలుగుదేశం పార్టీలోకి పంపి తను మాత్రం వైసీపీలో ఉన్నారు.డిమాండ్లు అంగీకరించిన తరువాతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారా ?అనే సందేహలు కలుగుతున్నాయి. బుట్టరేణుకు తెలుగుదేశం పార్టీ తిర్థం పుచ్చుకోవడంతో అయువ శాసనసభ్యుడి టిక్కెట్ లెనట్టేనా బుట్ట రేణుక నిర్ణయం పై ఆయువ శాసన సభ్యుడి రాజకీయ జీవితం ఆధారపడివుందా? జయనాగేశ్వర రెడ్డి, బుట్టా రేణుకల మధ్య పోటి ఉండనుందా టిక్కెట్ దక్కకుంటే జయనాగేశ్వర రెడ్డి పరిస్ధితి ఎంటి. చంద్రబాబు బుజ్జగిస్తారా లేదా బుట్టా రేణుక ఇంకో అసెంబ్లీ స్థానాన్ని కేటాయించనున్నారా?


Share

Related posts

‘బాషా’నా.. లేక ‘బాబా’నా..! రజినీ రాజకీయం ఏంటో..!?

Muraliak

Sashikala : చెన్నై చేరిన చిన్నమ్మ! తమిళ రాజకీయం రసంకాందయం!

Comrade CHE

అన్నంత ప‌ని చేసిన బీజేపీ… ఇక జ‌గ‌న్ విష‌యంలో జ‌రిగేది అదే

sridhar

Leave a Comment