Subscribe for notification

మీరు అధికారులా లేక అధికార నాయకులా!! ఈ కీచులటలు మీకే నష్టం

Share

 

 

మొన్న ఆదిత్యనాథ్ దాస్… నా గోపాలకృష్ణ ద్వివేది…, రేపు ఎవరు అనేది కొందరు నిర్ణయిస్తారు?? ఆ కొందరు ఎవరు ఏమిటి ఎందుకు ఎలా అనే ప్రశ్న లు మాత్రం వేయకండి. రోజుకు ఓ ఐఏఎస్ అధికారి లేకపోతే అంతకన్నా ప్రభుత్వంలో ముఖ్యులు… స్థానిక సంస్థల ఎన్నికల పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఇచ్చిన నోటిఫికేషన్ మీద ఆయన మీద వ్యక్తిగతంగా స్పందిస్తూనే ఉంటారు.. అదేంటి అధికారులు మరో అధికారి మీద ఇష్టానుసారం స్పందించడం ఏమిటి?? అలా ఎందుకు చేస్తారు? పాలకుల తరఫున వకాల్తా ఎందుకు పుచ్చుకుంటారు అంటూ నిబంధనల మేరకు ప్రశ్నలు అడగండి…!! ఆంధ్రప్రదేశ్లో అన్ని అంతే.. నంది పంది అవ్వచ్చు పంది నంది అవ్వచ్చు ఏది ఏమైనా అవ్వచ్చు. ఎప్పుడైనా అవ్వచ్చు.

ఇది దూరహంకారం ఎలా అవుతుంది?

**రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ ఎన్నికల కమిషన్ ఆదేశాలను పరిగణించక పోవడం తప్పు కాదు… స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది పంచాయతీలకు తగు ఆదేశాలు జారీ చేయకపోవడం తప్పుకాదు… స్వతంత్ర సంస్థగా ఉన్న ఎన్నికల కమిషన్ తన విధులు నిర్వహించడం లో భాగంగా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం మాత్రం దురహంకారం కిందే వస్తుంది. అది ఎందుకు ఎలా అనే ప్రశ్నలు మళ్ళీ అడగకండి.. ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సివిల్ సర్వీసు అధికారుల అంతా ఏకతాటి మీద ఉంటారు. ఎలాంటి విషయాన్ని అయినా వారు అంతా ఏకమై దాని సాధిస్తారు. ఒకవేళ పాలకులతో ఏమైనా గొడవలు వచ్చినా సివిల్ సర్వీసుల సంగం లో పెట్టి దానికి అనుగుణంగా సీనియర్ అధికారులు అంతా ఏకమై పాలకొల్లు తో మాట్లాడి షెడ్యూలు చేయడం అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. అధికారులంతా అధికార పార్టీ నాయకుల్లా మాట్లాడతారు. ప్రభుత్వం నిబంధనలు అనుసరించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్న వీరే స్వాగతిస్తారు. అసలు ఐక్యత అనేది వీరిలో మచ్చుకైనా కనిపించవు. ఎవరి పని వారిది ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వారివి. ఎవరు ప్రయోజనాల కోసం ఎవరు ఎవరితో కనీసం మాట్లాడడం అయినా మాట్లాడను ఐనా మాట్లాడారు.

రేపు మీకు ఆ పరిస్థితి రావొచ్చు!

**నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వం గట్టి పట్టుదల మీద ఉందనేది బహిరంగ రహస్యం. ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ విధులకు ముఖ్యమంత్రి జగన్ పదేపదే ఆటంకం కలిగిస్తూ ఉంటే దానిని సివిల్ సర్వెంట్ లంతా ఏకమై ఖండించాలి. పాలకులు తమ విధుల్లో ఎలా చొర బడతారు అనీ ప్రశ్నించాలి.. కానీ ఆంధ్రప్రదేశ్ లో అలాంటివి ఏమి జరగవు. పాలకులు ఎలా ఆడమంటే అలా ఆడడమే వారికీ తెలుసు. రేపు ఇదే పరిస్థితి పాలకులు ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా ఆయా శాఖల అధికారుల అనుమతి లేకుండా తీసుకొస్తే.. ఇదే అధికారులు ఇరుక్కుపోతే అప్పుడు ఎవరు ప్రశ్నిస్తారు అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

పొరపాటు కానీ తప్పు కాదు!

**కరుణ పేరు మీద ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను కనీసం ప్రభుత్వంతో సంప్రదించకుండా వాయిదా వేయడం అనేది ఆయన చేసిన పొరపాటు. అంతే తప్ప ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలి ఇప్పుడు ఆపాలి ఎప్పుడు వాయిదా వేయాలి అంశాలన్నీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కు ఉన్న అధికారాలు. ఆయన చేసింది కేవలం పొరపాటు మాత్రమే… తప్పు కాదు. తాకిన విధులను ఆయన సరిగా నిర్వర్తించిన చిన్న పొరపాటు కారణంగా ఆయన ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. జగన్ అహం మీద దెబ్బకొట్టింది. కనీసం ప్రభుత్వ పెద్దలతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని జగన్ కోపం. దీని తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణ పై ముందుకు వెళ్లి… ఎక్కడ తగ్గకుండా కోర్టులో కేసు వేయడంతో ఈ విషయం పెద్దదయింది. ఎన్నికల కమిషనర్ గా తాను ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా ప్రభుత్వం పాటించాలని ఎన్నికల నిర్వహణకు సహకరించాలని రమేష్ కుమార్ వాదన. నిబంధనల మేరకు అయితే అది అక్షరాల నిజమే. అయితే ఎన్నికల వాయిదా అనంతరం ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను చంద్రబాబు సొంత మనిషిగా ప్రకటించి… ప్రత్యక్ష యుద్ధానికి తెరతీశారు. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థలకు ఏకంగా నోటిఫికేషన్ ఇచ్చినా… సహకరించబోమని అంటూ ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. ఏ కరుణా కారణమైతే నిమ్మగడ్డ చూపి ఎన్నికలను వాయిదా వేశారు.. ఇప్పుడు అదే కరోనా వ్యాక్సిన్ పేరు చెప్పి ప్రభుత్వం ఎన్నికలను ఇప్పుడు నిర్వహించలేదని మీరు వెళ్లిన తర్వాత నిర్వహించుకుంటూ చెప్పడం చూస్తే… దానికి అనుగుణంగా సివిల్ సర్వీస్ అధికారులంతా ప్రభుత్వానికి …


Share
Comrade CHE

Recent Posts

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

48 mins ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

2 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

3 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

3 hours ago

KTR: రూపాయి ఎందుకు పతమైంది మోడీజీ… కేటిఆర్ ట్వీట్ వైరల్

KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…

4 hours ago

Naresh’s third wife ramya attack: నరేష్, పవిత్ర లోకేష్ ల.. జంటపై పోలీసుల ముందే చెప్పుతో దాడికి పాల్పడ్డ నరేష్ మూడో భార్య రమ్య ..!!

Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…

4 hours ago