NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

తెరపైకి ఆర్టికల్ 356!!జగన్ ఎం చేయబోతున్నారు??

ఆర్టికల్ 356… రాజ్యాంగం రూపొందించినప్పుడు తయారు చేసిన అత్యంత శక్తివంతమైన ఆర్టికల్ ఇది.. రాష్ట్రాలుగా విడిపోయిన భారతదేశం రాష్ట్రాల పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న రాజ్యాంగం అమలులో రాష్ట్రాలు ఇష్టారీతిన వ్యవహరించి రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావన్నీ పూర్తిగా మంట గలిపితే.. వెంటనే కేంద్రం రంగంలోకి దిగి రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే ఆర్టికల్ ఇది.. వెనువెంటనే గవర్నర్ పాలన అమలులోకి వస్తుంది… ఆరు నెలల తర్వాత ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ 356 అమ్మ మీద అప్పుడే ఊహాగానాలు ఊపందుకున్నాయి. చినికి చినికి గాలివానగా మారుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్.. రాష్ట్ర ప్రభుత్వం తాలూక ఎన్నికల వివాదం చాలా వేగంగా పెద్దగా అయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఈ రోజు ఎం జరగనుంది??

అత్యున్నత న్యాయస్థానం లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హౌస్ మోషన్ను నమోదు చేసింది. అంటే ఇది అత్యంత ప్రాధాన్యతగల కేసుగా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని సోమవారం దీనికి తగు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని ఫేస్ ఎన్నికలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో సుప్రీం కోర్టు సోమవారం ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం గానీ ఒక ఆదేశం గాని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశం లేదా సూచన ప్రకారం ఎవరికి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా అది తీర్పు వచ్చినప్పటికీ ఖచ్చితంగా దాన్ని అమలు చేసే బాధ్యత వారిపై ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ శనివారం విలేకరుల సమావేశంలో సుప్రీంకోర్టు సూచనల ప్రకారం నడుచుకుంటామని, ఎలాంటి తీర్పు వచ్చిన అమలు చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు కనుక రాష్ట్ర ప్రభుత్వ వాదనకు తలోగ్గి లేదా ఇతర కారణాలను చూపి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికలను వాయిదా వేయాలని చెబితే ఎలాంటి సమస్య ఉండదు. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కచ్చితంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం సహకరించాలని చెబితే మాత్రం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తికారం. దాని తర్వాత ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయి?? అధికారులు ఏ విధంగా సుప్రీం ఆదేశాలను ముందుకు తీసుకెళ్లారు ఎన్నికలను ఏ విధంగా నిర్వహిస్తారు అన్నది కూడా చూడాల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా వచ్చి దానిని పాటించకుండా కోర్టు దిక్కారం కనుక జగన్ ప్రభుత్వం చేస్తే…. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి… కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యాంగ అమలుకు చర్య తీసుకోవాలని.. దానికి అనుగుణంగా రాష్ట్రంలో 356 ఆర్టికల్ ను ఇంప్లిమెంట్ చేయాలని చెబితే అసలు రచ్చ అప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది.

అందరికి అర్ధమయ్యింది!

ఇప్పటి వరకు సాధారణ ప్రజానీకానికి ఈ గొడవ అర్థం కాకపోవచ్చు కానీ ఇప్పుడు వేగంగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం వాదనను సగటు పౌరుడు సైతం అర్థం చేసుకుంటున్నాడు. ఇది పూర్తిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత వివాదంగా మారింది అని అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తుల ఈగో రాజ్యాంగ మౌలిక లక్షణాన్ని ప్రభావితం చేసేలా ఉండడమే ఇప్పుడు అసలు అపాయకారం. ప్రభుత్వం చెబుతున్నట్లు కరోనా గురించి ఎన్నికల వాయిదా కోరడం లేదు అన్నది….. ఇప్పుడు అత్యవసరంగా స్థానిక సంస్థలు నిర్వహించాల్సిన అగత్యం కూడా లేదు అన్నది అంత అర్థం చేసుకుంటున్నారు. కేవలం ఇది ఓ వ్యక్తిగత వివాదం గానే రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దీనిలో ఎవరు లబ్ది ఏమిటి?న్యాయ విషయాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా జగన్మోహన్ రెడ్డి మొండి పట్టుదల వల్లే కేసు ఇంతవరకు వచ్చింది అనేది మాత్రం నిజం. సోమవారం ఈ కేసు సుప్రీంకోర్టులో తెలుగు వాడైన లావు నాగేశ్వరరావు ధర్మాసనం దృష్టికి వెళ్లనుంది. ఇటీవల కేరళ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వివాదం వచ్చినప్పుడు సైతం రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు అలాంటి చేసే ఇప్పుడు వెళ్లడం… ఆయన ఈ కేసులో ఎలాంటి ఘనమైన తీర్పు ఇస్తారా లేక కొనసాగించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా తగు ఆదేశాలు ఇస్తారా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

author avatar
Comrade CHE

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!