NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నమ్మకు అచ్చెన్నా.. అంటూ చంద్రబాబు విషయంలో అచ్చెన్నకు సన్నిహితుల సలహాలు

Atchannaidu is suggested not to fall in trap of chandrababu

చంద్రబాబు ఎవ్వరినైనా తనకు అనుకూలంగా మార్చుకోగలరు. తనకు పనికొచ్చే వారిని.. తను చెప్పినట్టు వినేవారినే తన దగ్గర ఉంచుకుంటారు చంద్రబాబు. అంతే కాదు.. తాను ఏది చెబితే అది వినేవాళ్లంటేనే ఆయనకు ఇష్టం. ఆయనకు ఎదురు తిరగడమంటే పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడమే. అలా.. ఆయనకు ఎదురు చెప్పి టీడీపీ నుంచి ఎందరో నాయకులు బయటికి వెళ్లిపోయారు.

Atchannaidu is suggested not to fall in trap of chandrababu
Atchannaidu is suggested not to fall in trap of chandrababu

ఇక.. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం టీడీపీ సర్కిల్ లో వినిపిస్తున్న ఒకే ఒక వార్త.. అచ్చెన్నాయుడికి ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగించడం. ఈ వార్తే ప్రస్తుతం ఏపీలో హల్ చల్ చేస్తోంది. ఇటీవలే అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ పై తిరిగి వచ్చిన ఆయనకు చంద్రబాబు ఏపీ టీడీపీ పగ్గాల ఆశ చూపిస్తున్నారా? అనేది అంతుపట్టడం లేదు.

ప్రస్తుతం ఏపీకి టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. సడెన్ గా కళాను కాదని అచ్చెన్నాయుడికి ఎందుకు టీడీపీ అధ్యక్షుడి పదవి ఎందుకు ఇవ్వడం? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Atchannaidu is suggested not to fall in trap of chandrababu
Atchannaidu is suggested not to fall in trap of chandrababu

పోనీ.. అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లకముందు ఆ పదవిని ఇస్తామన్న వార్తలు రాలేదు. కానీ.. అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లి రాగానే చంద్రబాబుకు ఆయన మీద ఒక్కసారిగా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది. గతంలోనూ వర్ల రామయ్యను రాజ్యసభ ఎంపీ పదవి కోసం బరిలో దింపి చివరకు ఆయన్ను బకరా చేసినట్టే.. అచ్చెన్నాయుడిని కూడా ఎటువంటి అధికారం లేని ఈ పదవి ఇచ్చి బకరా చేస్తారా? ఇదేనా చంద్రబాబు వ్యూహం.. అంటూ రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

అయితే.. అచ్చెన్నాయుడి సన్నిహితులు మాత్రం.. చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని.. ఆ పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.. దాని వల్ల ఒరిగేదేం ఉండదని.. ఆ పదవి కోసం ఆశపడి.. చంద్రబాబు వలలో చిక్కొద్దంటూ సలహాలు ఇస్తున్నారట.

ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఏదో కోరుకుంటున్న చంద్రబాబు.. అందుకే ఆ ప్రాంతం వ్యక్తి అచ్చెన్నాయుడికి ఈ పదవిని కట్టబెట్టి ఏదో సాధిద్దామనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంద్రులకు తానేదో న్యాయం చేస్తున్నట్టు చంద్రబాబు ఫీల్ అవుతన్నా.. అక్కడ జరిగేదేం లేదని.. చంద్రబాబు రాజకీయలు తెలియనిది ఎవరికి.. అంటూ పొలిటికల్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

author avatar
Varun G

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N