NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అయోధ్య అయింది… ఇక బీజేపీ చూపు ఎక్కడ..?

 

ఒక అధ్యాయం ముగిసింది. అయోధ్య రామమందిర నిర్మాణంతో బిజెపి మూడు దశాబ్దాల కల, మూడు దశాబ్దాల పోరాటం, మూడు దశాబ్దాల సెంటిమెంట్ సాకారం అవుతుంది. అంతా బాగానే ఉంది. బిజెపి పెద్దలు అనుకున్నది సాధించారు. బిజెపి ముందు తరం నాయకులు అయోధ్య సాకారం చేస్తే, బిజెపిలో ప్రస్తుత తరం నాయకులు అయోధ్య తర్వాత ఏమిటి అని ఆలోచనలో పడ్డారు. నిజమే, ఇది బిజెపి లోనే కాదు. దేశీయంగా జరుగుతున్న చర్చ. బిజెపి గురించి బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు. అయోధ్య తరువాత ఏమిటి? ఏ అంశం పట్టుకుంటారు. ఏ అంశం పై రాజకీయం చేస్తారు? అనేదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరం.

Ayodya issue over what next

శబరిమలను ప్రక్షాళన చేస్తారా?

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించి ఒక వివాదం నడుస్తున్నది. అయ్యప్ప ఆలయంలోకి మహిళలు అన్ని వయసుల వారు ప్రవేశించవచ్చు అంటూ 2018లో సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం పెద్ద దుమారానికి దారి తీసింది. భక్తుల మనోభావాలు, ఆలయ సంప్రదాయాలకు ఇది విరుద్ధమని వాదిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు కాగా విచారణ జరుగుతున్నది. పలువురు మహిళలు సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆలయంలో స్వామి వారి దర్శనంకు వెళ్లడం, వీరిని దీక్షా స్వాములు అడ్డుకోవడం తెలిసిందే. తొలుత సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి కేరళ రాష్ట్ర ప్రభుత్వం యువతుల ఆలయ ప్రవేశానికి పోలీస్ రక్షణ కల్పిస్తామని ప్రకటించినా భక్తుల నుండి పెద్ద ఎత్తున తిరుగుబాటు ఎదురుకావడంతో వెనక్కు తగ్గింది.

మధురై ఆలయం విషయంలో బీజేపీ వైఖరి ఏమిటి?

మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం కూడా పురాతన ఆలయాలలో ఒకటి. ప్రస్తుతం ఈ ఆలయం విషయంలో కూడా కొన్ని స్వల్ప వివాదాలు ఉన్నాయి. ఇది కూడా సెంటిమెంట్. అయితే ఇది తమిళనాడు రాష్ట్ర పరిధిలోని కావడంతో సాధారణంగా తమిళుల ఆలయాల జోలికి బీజేపీ వెళ్లే అవకాశం ఉండదు. ఆలా వెళితే రామేశ్వరం జోలికి కూడా వెళ్ళాలి. రామేశ్వరం ఒక ద్విపంలా దేశానికి, రాష్ట్రానికి సంబంధం లేకుండా ప్రత్యకంగా ఉంటోంది. రామేశ్వరంలో వచ్చే ఆదాయానికి, అక్కడి ప్రభుత్వానికి సంబంధం లేకుండా సపరేట్ గా ఉంది. సో.. ఇలా తమిళనాడులో ఆలయాలను ప్రక్షాళన చేస్తుందా? హిందుత్వ అజెండాతో ముందుకు వెళుతున్న బీజేపీ అయోధ్య తరువాత శబరిమల, తదితర ఆలయాలపై దృష్టి ఏమైనా సారిస్తుందా అనేది వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju