NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబు ఆ తప్పు చేసి శిక్ష అనుభవించారు! అయినా జగన్ అదే బాటలో పోతున్నారు!!

గతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పునే ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కూడా చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 Babu made that mistake and was punished! However, Jagan is going down the same path
Babu made that mistake and was punished! However, Jagan is going down the same path

ముఖ్యమంత్రి కాగానే జగన్మోహన్రెడ్డి పార్టీని పక్కన పెట్టేశారనది వైసీపీ వర్గాల్లోనే ఉన్న భావన.ఇంత ముందు చంద్రబాబు కూడా ఇదే పని చేశారు. పవర్లో ఉన్నప్పుడు కేవలం అధికార యంత్రాంగాన్ని నమ్మి వారికి అత్యధిక ప్రాధాన్యం వచ్చి పార్టీ వారిని విస్మరించి చంద్రబాబు ఎంతగా దెబ్బతిన్నారో మొన్నటి ఎన్నికల్లో రుజువైంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని బాగా సమర్థంగా నడిపిస్తారు.పార్టీ నాయకుల్ని కార్యకర్తలను నిద్రపోనీరు.తాను నిద్రపోడు.అయితే అధికారంలోకి రాగానే చంద్రబాబు పార్టీకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వరని విమర్శ లేకపోలేదు.ఇందువల్లే ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోయారని కూడా పార్టీ వర్గాలు చెప్పుకుంటాయి.ఇక జగన్ విషయానికొస్తే ఆయన చంద్రబాబు పంధానే అనుసరిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

జగన్ వ్యక్తిగా చేసిన పోరాటానికి వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన అండ కారణంగానే 2019ఎన్నికల్లో అంత ఘనవిజయం సాధ్యపడింది. కానీ ఒక్కసారి సీఎం సీట్లో కూర్చోగానే జగన్ ప్రాధాన్యత క్రమాలు మారిపోయాయి.ఆయన పై స్థాయిలో జిల్లా క‌లెక్టర్లను, దిగువ స్థాయిలోకి వస్తే వార్డు వాలంటీర్లను నమ్ముతున్నారు. దాదాపు పార్టీ అసలు అవసరం లేదన్న రీతిలో జగన్ వ్యవహారశైలి ఉందని వైసీపీ నేతలు కార్యకర్తలు వాపోతున్నారు మరి ముఖ్యమైతే మంత్రులతోనో, ఎంపీలతోనో, ఎమ్మెల్యేలతోనో పనులు గానిస్తున్నారు. ద్వితీయశ్రేణి నాయకులకు కార్యకర్తలకు అసలు ప్రాధాన్యమే లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం అయినా పదవుల పందేరం జరగలేదు. పార్టీ అగ్ర నాయకులకయితే సలహాదారు పదవులో ఇంకొకటో ఇచ్చి సంతృప్తి పెట్టిన ముఖ్యమంత్రి సామాన్య నాయకులని, కార్యకర్తలను గుర్తించటమే లేదు.

ఇంకా చెపాలంటే జగన్ ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారు.ఆయన పార్టీ ప్రెసిడెంట్ గా ఎపుడూ కనిపించడంలేదు.ఆయన పార్టీ కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో నిర్వహించిన దాఖలాలు కూడా లేవు.తాడేపల్లిలో రాష్ట్ర పార్టీ ఆఫీస్ ఉంది. కానీ అక్కడ పార్టీ యాక్టివిటీస్ లేవని అంటున్నారు. ఇక జిల్లాల్లో సమస్యలను చెప్పుకుందామని పార్టీ ఆఫీస్ కి వెళ్తే పట్టించుకునే నాధుడు లేడని వైసీపీ క్యాడర్ ఆక్రోసిస్తోంది. ఇదే విధంగా మరిన్నాళ్ళు జరిగితే వైసీపీకి మిగిలేది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తప్ప పార్టీ నాయకులు ఎవరూ ఉండరని అంటున్నారు. జగన్ తన వైఖరి మార్చుకోకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు.

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!