NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Badvel By Elections: బద్వేలు భారీ ఆధిక్యం.. కానీ అప్రమత్తం..! “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పింది..!

Badvel By Elections: Huge Majority alert to YSRCP

Badvel By Elections: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల తుది ఫలితం వచ్చేసింది. వైసీపీ అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధ 90,550 మెజార్టీతో విజయం సాధించారు. ఇంత మెజార్టీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. టీడీపీ వాళ్లు 20 లేదా 30వేల వరకూ మెజార్టీ రావచ్చని భావించారు. వైసీపీ లక్షకు పైగా మెజార్టీ వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. అయితే న్యూస్ ఆర్బిట్ ముందే చెప్పడం జరిగింది. 90 నుండి 95వేల మధ్య మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు “గెలుపు లెక్క – ఈ మెజారిటీ పక్కా..!? జగన్ పై నమ్మకం పరీక్ష..!!” అంటూ స్పష్టం చేయడం జరిగింది. అ అంచనా ఎందుకు అనే విషయాలను ఈ కథనంలో వివరించడం జరిగింది. ఈ రోజు ఫలితాల్లో అదే నిజమని తేలింది.
బద్వేల్ ఉప ఎన్నికల సందర్భంగా పోల్ అయిన లెక్కలు, అందులో వైసీపీకి ఎందుకు ఈ మెజార్టీ వచ్చింది. టీడీపీ ఓట్లు ఏమయ్యాయి అనేది అన్న విషయాలను పరిశీలిస్తే..ముందుగా 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 95,482 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 50,748 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ అభ్యర్ధి సుమారు 45వేల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు వైసీపీ 90వేల మెజార్టీతో గెలిచింది. కానీ వైసీపీకి వచ్చిన ఓట్లు చూసుకున్నట్లయితే లక్షా 12వేల ఓట్లు మాత్రమే. మెజార్టీ పోలిస్తే 45వేలు పెరిగింది కానీ ఓట్లు అంతగా రాలేదు. గతంలో 95వేలు వస్తే ఇప్పుడు లక్షా 12 వేలు అంటే కేవలం 17వేల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీ లేనప్పుడు వైసీపీకి వచ్చిన మెజార్టీ ఇది. వైసీపీ ఇది గమనించాల్సి ఉంటుంది. గతంలో టీడీపీ పోటీలో ఉన్నప్పుడు 95వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీ పోటీ లో లేనప్పుడు 17వేలు మాత్రమే పెరిగాయి. గతంలో టీడీపీ 50వేల వరకూ ఓట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం 750 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు బీజేపీకి 21వేల ఓట్లు వరకూ వచ్చాయి.

Badvel By Elections: Huge Majority alert to YSRCP
Badvel By Elections Huge Majority alert to YSRCP

Badvel By Elections: టీడీపీ ఓట్లు ఏమైనట్టు..!?

ఇప్పుడు లెక్క వేయాల్సింది గతంలో టీడీపీకి వచ్చిన 50వేల ఓట్లు ఏమైనట్లు అనేది..!? వాటిలో వైసీపీకి అదనంగా పెరిగిన 17వేల ఓట్లు టీడీపీ ఓట్ల కింద లెక్కవేయవచ్చు. అదే విధంగా బీజేపీకి వచ్చిన 21వేలలో 19వేల ఓట్లు టీడీపీవిగా లెక్క వేయాల్సి ఉంటుంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి 6వేల పైచికులు ఓట్లు వచ్చాయి. గతంలో ఇన్ని ఓట్లు కాంగ్రెస్ కు రాలేదు. అలాగే నోటాకు 3600 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే టీడీపీకి చెందిన 50వేల ఓట్లలో వైసీపీకి 17వేలు, బీజేపీకి 19వేలు, కాంగ్రెస్ పార్టీకి 5వేలు, నోటాకు 1500 ఓట్లు ఇలా డైవర్ట్ అవ్వగా.. కొన్ని అసలు పోలింగ్ కి రాలేదు. అందుకే పోలింగ్ శాతం కూడా తగ్గింది. సుమారు పదివేల టీడీపీ ఓట్లు పోల్ కాలేదు. ఇది వాస్తవిక లెక్క. వైసీపీకి మెజార్టీగా 90వేలు కనబడుతున్నా గత ఎన్నికల కంటే పెరిగింది 17వేల ఓట్లు మాత్రమే అనేది గ్రహించాలి. అదీ కూడా ప్రధాన ప్రతిపక్షం పోటీ లేకుండా ఉంటే. ఎన్నికల్లో వైసీపీకి బీజేపీ సమ ఉజ్జీ కానేకాదు. టీడీపీ, వైసీపీ పోటీ పడితేనే వాస్తవిక లెక్క బయటపడుతుంది. సమఉద్దీతో తలబడకుండా బలహీనుడుతో పోటీపడి ఒక్క దెబ్బతో నేల కరిపించాను అనుకుంటే అది అవివేకమే అవుతుంది. ఇది పార్టీకి మంచి ఆత్మా విశ్వాసం.. బలం చేకూర్చేది అయినప్పటికీ.. అప్రమత్తత కూడా ముఖ్యమే..!

author avatar
Srinivas Manem

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju