NewsOrbit
రాజ‌కీయాలు

తిరుపతి ఉపఎన్నికలో ‘బండి’ సంజయ్!

 

 

మొన్న దుబ్బాక ఉప ఎన్నికలు.. నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఇప్పుడు బండి సంజయ్‌కు హైకమాండ్‌ కొత్త టాస్క్‌ అప్పగించనుందా? తెలంగాణలో పని చేసిన‌ బండి వ్యూహాలు పక్క రాష్ట్రంలో పనికొస్తాయా? బండి దూకుడు అక్కడ బీజేపీకి ఎ మాత్రం పని చేస్తుంది? కుల రాజకీయాలున్న చోట హిందుత్వ ప్రచారం ఓట్లు దక్కుతాయా?

**తెలంగాణ రాజకీయాల్లో ఇపుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు బండి సంజయ్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడయ్యాక బండి సంజ‌య్ త‌న‌దైన శైలిలో రాణిస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండి చేస్తోన్న వ్యాఖ్యలు ఆయ‌న‌కు ప్రజల్లో ప్రత్యేక స్థానం తెచ్చిపెట్టాయి. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఆయన పేరు వేగంగా పెరుగుతోంది. ఇక దుబ్బాక ఉప ఎన్నిక‌లు, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నికల్లో ఆయ‌న చేసిన సవాళ్లు, విమర్శలు తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి. గ్రేటర్ ఎన్నికల ప్రచారమంతా ఆయ‌న చుట్టే తిరిగేలా చేసారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ సీనియర్ నేతల కంటే బండి సంజ‌య్ విమర్శలు చాల ఘాటుగా మారాయని చర్చలు జరిగాయి. దుబ్బాక ఉప ఎన్నిక విజయం.. ‌గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడంతో జాతీయ నాయ‌క‌త్వం దగ్గర బండి మంచి పేరు సంపాదించారు.

**పార్టీ అధిష్టానం బండి సంజ‌య్‌ను స‌క్సెస్ ఫుల్ లీడ‌ర్‌గా అనుకుంటుంది దీనితో పైఅధికారులు ఆయనకు అద‌న‌పు బాధ్యతలు కట్టబెడుతున్నటు సమాచారం. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో బండి సంజయ్ తో ప్రచారం చేయించాల‌ని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతకంటే ముందే తిరుప‌తికి పంపించి హైప్ తీసుకురావాలని హై కమాండ్ సన్నాహాలు‌ చేస్తుంది ఇదే విషయం పై ప్రస్తుతం పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఈనెలఖారులో బండి సంజయ్ తిరుపతి టూర్‌ ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నా.. బిజీ షెడ్యూల్ వలన ఆయన పర్యటన‌ కొత్త ఏడాది మొదట్లో ఉంటుందని సమాచారం. వచ్చే మార్చిలో తిరుపతి ఉప ఎన్నికలు జరిగే అవకాశముందనీ.. నోటిఫికేషన్ రాకముందే సంజయ్‌ను తిరుపతికి పంపటం ద్వారా ఎన్నికల వేడిని రాజేయాలనేది కమలనాథుల ఆలోచన.

ఇదంతా జరుగుతుందా..!?

**ఓపక్క తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయాలని బీజేపీ తన మిత్రపక్షమైన జనసేన పార్టీ భావిస్తుంది.కానీ సంజ‌య్ తిరుపతి వెళ్ళి వ‌స్తే ఎవరు పోటీచేసినా ఖచ్చితంగా బలం‌ పెరుగుతోందన్న భావ‌న‌లో కమలం పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ రాజకీయాలు పూర్తిగా వేరుగా వున్నాయి.తెలంగాణలో ఎంఐఎంను బీజేపీ టార్గెట్ చేస్తుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తుందని అంచనా. మత మార్పిళ్లను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కమలనాథులు అంటున్నారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయన్న అంశాలను ప్రచార అస్త్రాలుగా మలుచుకోవాలని చుస్తునారు. బండి సంజయ్‌తో పాటు ధర్మపురి అరవింద్, రాజాసింగ్, రఘునందనరావులను సైతం తిరుపతి ఉప ఎన్నిక ప్రచారనికి పంపాలని బీజేపీ హైకమాండ్‌ సన్నాహాలు చేస్తుంది. అయితే తెలంగాణ‌లో విజయం సాధించిన బండి సంజయ్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తుందో లేదో చూడాలి.

author avatar
Comrade CHE

Related posts

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!