NewsOrbit
రాజ‌కీయాలు

బండి సంజయ్ భారీ ప్లాన్..! కేసీఆర్ కి ధీటు వ్యూహం..!

https://newsorbit.com/politics/bandi-sanjay-master-plan-to-face-cm-kcr-in-ghmc-elections.html

‘పాదయాత్ర..’ ఈ పదానికి సమకాలీన రాజకీయాల్లో చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ( లోపాయకారి పరమార్ధం వేరే అనుకోండి ) రాజకీయ నాయకులు చేపట్టే ఈ పాదయాత్ర మహా శక్తివంతమైంది. ‘కష్టే ఫలి’ అనే నానుడి ఇక్కడ బాగా అప్లై అవుతుంది. 2003లో పాదయాత్ర చేసి దానికో స్థాయి స్టార్ డమ్ తీసుకొచ్చిన వ్యక్తి నిస్సందేహంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు కూడా 2012లో పాదయాత్ర చేశారు. వీరిద్దరూ చేసిన మ్యాజిక్ చూసిన వైఎస్ జగన్ 2017లో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మూడు పాదయాత్రల ఫలితం.. ఆ ముగ్గురూ ‘సీఎం’ కావడం. ఇంతటి మ్యాజిక్ ఉన్న పాదయాత్రను ఇప్పుడు బీజేపీ చేయబోతోంది. ఎక్కడంటే..

bandi sanjay master plan to face cm kcr in ghmc elections
bandi sanjay master plan to face cm kcr in ghmc elections

బీజేపీకి అందివచ్చిన అవకాశం..

ఇటివలి దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది బీజేపీ. ఆ గెలుపుతోనే ఆగకూడదు.. ప్రభుత్వానికి ఇంకా ఎలా షాకులివ్వాలా అని ఆలోచిస్తున్న బీజేపీకి జీహెచ్ఎంసీ ఎన్నికలు వరంలా వచ్చాయి. ఈ స్పీడ్ కంటిన్యూ చేయాలని బీజేపీ.. వాళ్లకి చెక్ పెట్టాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ ప్రజలకు తాయిలాలు ప్రకటించింది ప్రభుత్వం.. అధికారంలో ఉంది కాబట్టి. కానీ.. బీజేపీ ఏం చేయాలి? ఆలోచించి.. ఆలోచించి తారకమంత్రం లాంటి నిర్ణయం తీసుకుంది. అదే ‘పాదయాత్ర’. గ్రేటర్ పరిధిలో ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీకి ఇంతకు మించిన ఐడియా రాలేదు. నేడు హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో జరగిన కీలక సమాశంలో ఈ ప్రతిపాదనకు తిరుగులేకుండా ఆమోదం లభించింది. ఇంతకీ ఈ పాదయాత్ర చేసేది ఎవరనేగా..! తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.

అదే సక్సెస్ కంటిన్యూ అవుతుందా..?

ఈమేరకు నిర్ణయం జరిగిపోయింది. కమిటీలు కూడా వేసేశారు. రూట్ మ్యాప్ కోసం తర్జనభర్జనలు జరుగుతున్నాయి. బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని టీఆర్ఎస్ ముందస్తుకు వెళ్తోంది. ఇదీ మా మంచికే.. దుబ్బాక ఎఫెక్ట్ పని చేస్తుందని బీజేపీ భావిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే.. నవంబర్ 16నే పాదయాత్ర మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు. 2003 పాదయాత్ర.. 2004లో వైఎస్ ను, 2010 పాదయాత్ర.. 2014లో చంద్రబాబును, 2017 పాదయాత్ర వైఎస్ జగన్ ను సీఎంను చేశాయి. మరి ఈ పాదయాత్ర బీజేపీని, సంజయ్ ను, టీఆర్ఎస్ ను ఏం చేస్తుందో చూడాలి.

 

author avatar
Muraliak

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju