బంగ్లాదేశ్‌లో పోలింగ్ ప్రారంభం

Share

ఢాకా, డిసెంబరు30: బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. దేశంలోని 300 పార్లమెంటరీ స్థానాలకుగాను 299 స్ధానాలకు జరుగుతున్న ఎన్నికలకు 1,848 మంది అభ్యర్దులు రంగంలోవున్నారు. ఈ ఎన్నికల్లో దేశంలోని సుమారు 10.41 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సమరంలో భాగంగా పలుచోట్ల జరిగిన అల్లర్లలో 13 మంది మరణించారు. ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనా వాజెద్ వరుసగా నాలుగోసారి ప్రధానిపీఠంపై అధిష్టించాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బిఎన్‌పి) అధ్యక్షురాలు ఖలేదా జియా అవినీతి కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. అధికార అవామీ లీగ్, ప్రతిపక్ష బిఎన్‌పి మధ్య తీవ్రమైన పోటీ జరుగుతున్నది.
పోలింగ్ సందర్భంగా ఎటువంటి వదంతులు వ్యాపించకుండా ముందుజాగ్రత్తగా దేశవ్యాప్తంగా అధికారులు 4జీ, 3జీ, టెలికం, ఇంటర్‌నెట్ సేవలను ఆదివారం అర్ధరాత్రి వరకు నిలుపుదల చేయించారు. ఎన్నికల విధుల నిమిత్తం 40వేల పోలింగ్ స్టేషన్లలో ఆరు లక్షల మంది సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అల్లర్లకు పాల్పడేవారిని గుర్తించి 1500మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్షానికి చెందిన 17మంది అభ్యర్దులను పలు కారణాల రీత్యా అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ఎన్నికలను పూర్తి స్వేఛ్చాయుత వాతావరణంలో నిర్వహించడంలో విఫలం అయ్యిందని బంగ్లాదేశ్ సివిల్ సొసైటీ గ్రూప్ లీడర్ మజూందర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు పూర్తిగా స్వేఛ్చగా జరగాలని అమెరికా ఆకాంక్షించింది. పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు వరకూ జరుగుతుంది.


Share

Related posts

బ్రేకింగ్ : కరోనా తో తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు మృతి

arun kanna

మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మృతి

somaraju sharma

‘మంచి చేస్తుంటే భరించలేకపోతున్నారు!’

somaraju sharma

Leave a Comment