22.7 C
Hyderabad
March 24, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేరళ హైకోర్టులో తుషార్ పిటీషన్

Share

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తునకు తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ వేగవంతంగా కొనసాగిస్తుండగా వరుసగా ఈ కేసులో నోటీసులు అందుకుంటున్న వాళ్లు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కొందరు సిట్ అధికారుల నోటీసులకు హాజరై విచారణను ఎదుర్కొంటుండగా, మరి కొందరు హైకోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా 41 ఏ సీఆర్పీసీ నోటీసులపై స్టే ఇచ్చింది. విచారణకు హజరు కాని బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామిల పేర్లను సిట్ నిందితుల జాబితాలో చేర్చింది. సంతోష్, జగ్గుస్వామిలపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది.

Thushar Vellapally

 

అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళకు చెందిన బీడీజేఎస్ అధ్యక్షుడు తుఫార్ సిట్ దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తొన్నదని తుషార్ పిటిషన్లో ఆరోపించారు. ఈ నెల 21వ తేదీ విచారణ కు రావాలని 16వ తేదీన సిట్ నోటీసులు జారీ చేసిందనీ, అనారోగ్యం కారణంగా వైద్యుల సూచనల మేరకు రెండు వారాలు గడువు కోరినట్లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తన మెయిల్ కు సిట్ సమాధానం ఇవ్వకుండానే లుకౌట్ నోటీసులు ఇవ్వడం, కేసులో నిందితుడుగా చేర్చడం రాజకీయ దురుద్దేశమేనని తుషార్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

తెలంగాణలో సిట్ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. గతంలో సీబీఐకి ఇచ్చిన సమ్మతిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నదని ఇంతకు ముందు తెలంగాణ హైకోర్టులో వాదనల సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. ఈ కేసు విచారణలో తెలంగాణ హైకోర్టు కూడా సిట్ దర్యాప్తునే సమర్ధించింది. సిట్ దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో తుషార్ కేరళ హైకోర్టులో సీబీఐ దర్యాప్తును కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

టీడీపీలో ఒకప్పటి తోపు తురుము మంత్రి ! ఇప్పటి పరిస్థితి చూస్తే జాలేస్తోంది!!

Yandamuri

YS Jagan: సీఎం జగన్ కు అమిత్ షా అల్టిమేటం !ఏ విషయంలో అంటే??

Yandamuri

KCR: కేసీఆర్‌కు ఇంత కుల‌పిచ్చి ఉందా?

sridhar