బిగ్ బ్రేకింగ్: చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ..??

Share

చిరంజీవి తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు రాజకీయాల్లోకి రావడం అని ఆయన సన్నిహితులు తో పాటు సినిమా ఇండస్ట్రీలో ఆయన శ్రేయోభిలాషులు చాలా సందర్భాల్లో చెప్పటం జరిగింది. చిరంజీవి కూడా తాను రాజకీయాల్లోకి వెళ్లి పొరపాటు చేసినట్లు భావిస్తారని కూడా కొన్ని మీడియా ఛానల్స్ లో వార్తలు అప్పట్లో రావటం జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఘోరంగా విఫలం అయి, తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం అందరికి తెలిసిందే.

Don't enter politics': Chiranjeevi advises Rajinikanth, Kamal Haasanదీంతో అప్పటిదాకా మెగాస్టార్ చిరంజీవికి ఉన్న పాపులారిటీ రాజకీయాల్లోకి వచ్చాక పూర్తిగా కనుమరుగైంది అని చాలా మంది భావిస్తారు. అయితే 2014 ఎన్నికల సమయానికి వచ్చేసరికి రాష్ట్ర విభజన జరగడం తో పాటు కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడంతో చిరంజీవి మళ్ళి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం… వరస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఇటువంటి తరుణంలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పూర్తి విషయంలోకి వెళితే ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు చిరంజీవికి వీర భక్తుడు అని చెప్పుకొచ్చారు.

 

అంతేకాకుండా చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడం కోసమే సోము వీర్రాజు రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా రెండు గోదావరి జిల్లాలో మత, కుల రాజకీయాలు చేయడం కోసం సోము వీర్రాజు ప్రణాళికలు వేసినట్లు కూడా తెలిపారు. హర్షకుమార్ కామెంట్స్ పక్కన పెడితే సోము వీర్రాజు ఏపీ నూతన బిజెపి అధ్యక్షుడు అయ్యాక మొట్టమొదటిసారి చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో అప్పట్లో చిరంజీవిని బీజేపీ లోకి తీసుకు రావటానికి రామ్ మాధవ్ కూడా ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో హర్షకుమార్ చేసిన కామెంట్లు బట్టి చిరంజీవి కుదిరితే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మళ్ళీ రాజకీయాల్లోకి రీ -ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండే ఉంటుంది అన్న ఊహాగానాలు వస్తున్నాయి.

 


Share

Related posts

ఆ బీచ్ లో ర‌కుల్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!

Teja

తిరుపతి ప్రజలలోకి వైఎస్ జగన్..??

sekhar

Rashi Khanna Stunning Looks

Gallery Desk