బిగ్ బ్రేకింగ్: త్వరలో చంద్రబాబుతో కేసీఆర్ మీటింగ్..??

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మామూలుగా చూసుకుంటే 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే “ఫెడరల్ ఫ్రంట్” అంటూ కేసిఆర్ అప్పట్లో నానా హడావిడి చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే జాతీయ రాజకీయాలు కాంగ్రెస్, బిజెపి పార్టీలకి అధికారం దక్కకుండా ఉండేలా వ్యవహరించాలి అన్నట్టుగా అప్పట్లో కేసిఆర్ కామెంట్లు చేయడం జరిగింది. కానీ చివరి నిమిషంలో “ఫెడరల్ ఫ్రంట్” ఏర్పాటు విషయంలో కేసీఆర్ కొద్దిగా వెనక్కి తగ్గారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జాతీయ రాజకీయాల వైపు చూస్తున్న కేసిఆర్ చంద్రబాబుతో మీటింగ్ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వస్తోంది.

KCR Comments On Chandra babuగతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబుతో పాటు కేసీఆర్ కూడా రాజకీయాలు చేయడం జరిగింది. అయితే ఒకానొక సమయంలో మంత్రి పదవి దక్కలేదని కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రస్తుతం రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల విషయంలో చంద్రబాబుకి అనుభవం ఎక్కువగా ఉండటంతో… తిరిగి చంద్రబాబుతో స్నేహం చేయడానికి కేసీఆర్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా దేశంలో ప్రాంతీయ పార్టీలతో విడతల వారీగా చర్చించడానికి కేసిఆర్ డిసైడ్ అయ్యారట. దీనిలో భాగంగా తమిళనాడు ప్రాంతానికి చెందిన స్టాలిన్ అదేవిధంగా పశ్చిమబెంగాల్ ప్రాంతానికి చెందిన మమతాబెనర్జీ ఆ తరువాత చంద్రబాబుతో కేసిఆర్ భేటీ అవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ని జాతీయ రాజకీయాల విషయంలో పక్కన పెట్టాలని కేసిఆర్ డిసైడ్ అయినట్లు టాక్.

జగన్ ఎక్కువగా బిజెపి పార్టీకి అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా వర్గాల్లో వినబడుతున్న సమాచారం. ఏదిఏమైనా చంద్రబాబుతో మళ్ళీ కేసీఆర్ భేటీ అవుతున్నట్లు చాలా కాలం తర్వాత వార్తలు రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోపక్క చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే మోడీతో స్నేహం చేయడానికి తహతహలాడుతున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో ఈ వార్తలు రావడంతో కేసిఆర్ తో చంద్రబాబు కలుస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.