24.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బిగ్ బ్రేకింగ్: ఎన్నికల బరిలోకి పవన్ కళ్యాణ్..??

Share

కరోనా వైరస్ రావటంతో పవన్ కళ్యాణ్ చాలావరకూ సోషల్ మీడియాలో స్పందిస్తూ హైదరాబాద్ ప్రాంతానికి పరిమితం అయ్యారు. మరోపక్క వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో బిజెపి పార్టీకి మిత్రపక్ష పార్టీ గా రాణిస్తున్న పవన్ కళ్యాణ్ ని తెలంగాణ బిజెపి వాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికల తో పాటు దుబ్బాక ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Bandi Sanjay Kumar, Pawan Kalyan discuss political scene in AP, TS- The New  Indian Expressఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వంటి బలమైన ప్రత్యర్థి పార్టీ ని ఢీ కొనాలంటే బండి సంజయ్ పవన్ కళ్యాణ్ ని ఎన్నికల బరిలో దింపి ప్రచారాన్ని చేయించడానికి ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లోనే ఉండటంతో గ్రేటర్ ఎన్నికల బరిలో అవసరమైతే జనసేనకి కొన్ని స్థానాలు ఇప్పించి పవన్ కళ్యాణ్ చేత ఎన్నికల ప్రచారం చేయించాలని బండి సంజయ్ అనుకుంటున్నట్లు టాక్. అయితే ఈ విషయాన్ని నేరుగా కాకుండా ఢిల్లీ స్థాయి నేతలతో పవన్ కి చెప్పిస్తే ఆయన ఒప్పుకుంటారనీ…ఇందుకోసం ఢిల్లీ బీజేపీ నేతలతో బండి సంజయ్ సంప్రదింపులు చేస్తున్నట్లు త్వరలోనే ఈ విషయానికి సంబంధించి క్లారిటీ రానున్నట్లు టాక్.

 

ఏది ఏమైనా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జనసేన పార్టీ హెల్ప్ తీసుకునే జరగబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ తో ఢీ కొట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క టిఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రి కేటీఆర్ ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. డిజిటల్ స్థాయిలో ఎన్నికల ప్రచారం చేసే విధంగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధాన పార్టీలు తెగ ఉవిళ్లూరుతున్నాయి. 


Share

Related posts

బిగ్ బాస్ 4 : అవినాష్ కోస్ం రంగంలోకి జబర్దస్త్ ఆర్టిస్టులు… వర్క్ అవుట్ అయితే నేరుగా ఫైనల్స్ కే

arun kanna

ఆ జిల్లాలో వైసిపి నేతల మధ్య తీవ్ర పోటీ ..! కోట్లు కోసం వేటకైనా..!?

somaraju sharma

వంశీ చేసిన ఒక్క ప్రకటన…!వైసిపికి చెమటలు పట్టిస్తోంది..!!

somaraju sharma