NewsOrbit
Featured రాజ‌కీయాలు

బీహార్ లో బీజేపీకి పెద్ద గండి..! ఎన్నికల్లో ఊహించని విషయం బయటకు..!!

big jolt to bjp in bihar elections

బీహార్ అంటేనే కులాల కుంపట్లు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓ వర్గం ఓట్లు, ఎల్ జీపీకి పాశ్వాన్ తరపు దళిత ఓట్లు.. అనే లెక్క ఉంది. ఇప్పుడు వీరిద్దరి మధ్య అనధికారిక పొత్తు ఉండడంతో ఈ రెండు వర్గాల ఓటర్లు ఏకమై బీజేపీని నిలబెడతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక.. నితీశ్ కుమార్ వైపు ఓబీసీలు, వెనుకబడిన వర్గాలు నిలబడతారు. ఇక లాలూ కుటుంబం వెనుక మస్లింలు, యాదవులు ఉంటారు. మధ్యలో ఎఐఎం వెళ్లడంతో ఓట్లు చీలిపోయి.. పరోక్షంగా బీజేపీ లాభపడేలా చేస్తోంది. మొత్తంగా బీహార్ ఓటింగ్ ఇదే తరహాలో ఉంటుంది. అయితే.. ఈసారి బీహార్ ఎన్నికల్లో ఉద్యోగాల కల్పన ప్రధాన ఎజెండాగా మారిపోయింది.

big jolt to bjp in bihar elections
big jolt to bjp in bihar elections

బీహార్ లో కొత్త విప్లవం.. ‘నిరుద్యోగం’

ప్రతి పార్టీ కూడా ఇదే అంశాన్ని తీసుకుంటోంది. కరోనా, లాక్ డౌన్ పరిస్థితుల తర్వాత బీహార్ యువత ఉద్యోగాల కల్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కారణం.. లాక్ డౌన్ తో ఏకంగా బీహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన దాదాపు 25 నుంచి 30 లక్షల మంది మళ్లీ వెనక్కు వచ్చేశారు. ఈసారి తాము మరెక్కడికీ వెళ్లమనీ.. సొంత రాష్ట్రమే ఉపాధి కల్పించలని డిమాండ్ చేస్తున్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఫర్ ఇండియన్ ఎకనమీ లెక్కల ప్రకారం ఈ ఏప్రిల్ నాటికి ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉద్యోగం లేకుండా ఉన్నారు. దేశం మొత్తంలో ఉన్న నిరుద్యోగం కంటే రెట్టింపు ఒక్క బీహార్ లోనే ఉందని తేల్చింది.

పార్టీల వైఖరి ఇదీ..

తాము అధికారంలోకి వస్తే 10లక్షల ఉద్యోగాలిస్తామని ఆర్జేడీ నుంచి తేజశ్వీ యాదవ్ అంటున్నారు. ఇది అసాధ్యం అంటూ సీఎం నితీశ్ కొట్టిపారేశారు. కానీ.. ఆయన మిత్రపక్షం బీజేపీ ఏకంగా 19లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అంటోంది. ఏ ప్రాతిపదికన కల్పిస్తారో మాత్రం చెప్పరు. అయితే.. కరోనా నేర్పిన గుణపాఠాల్లో తమ రాష్ట్రమే తమకు ఉద్యోగాలు కల్పించాలని యువతలో ఓ మేల్కొలుపు రావడం ఒకటి. దీంతో ఇన్నాళ్లూ రాజకీయా పార్టీలు ఆడుతున్న కులాల ఆటలకు కాలం చెల్లే పరిస్థితులు వచ్చాయి. దీంతో ఈసారి ఏ పార్టీ గెలుపైనా నిరుద్యోగుల చేతుల్లోనే ఉందని తెలుస్తోంది. మరి.. నేతలు ఏం చేస్తారో చూడాలి.

 

author avatar
Muraliak

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?