రాష్ట్రాన్ని ఏలేద్దాము అనుకున్న అచ్చెన్న కి సొంత జిల్లా లోనే బిగ్ షాక్ ??

త్వరలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పదవిని చంద్రబాబు అచ్చెన్నాయుడు కు కట్ట పెట్టబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అసలే ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉన్న నాయకులు కూడా జంప్ అవుతున్న ఇలాంటి తరుణంలో అచ్చెన్నాయుడు పదవి రావటం ముళ్ళ కిరీటమే అని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేతిలో కి వచ్చిన మరుక్షణం సొంత జిల్లాలోనే అచ్చెన్న కి బిగ్ షాక్ రెడీగా ఉన్నట్లు తాజాగా సరికొత్త వార్త వైరల్ అవుతుంది.

Atchannaidu undergoes second surgery as bleeding fails to stopపూర్తి మేటర్ లోకి వెళ్తే సొంత జిల్లాలో టిడిపి పార్టీకి నాలుగు దశాబ్దాలుగా నమ్మకంగా పనిచేసిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పార్టీ మారడం గ్యారెంటీ అనే టాక్ వస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైసీపీ పార్టీకి ఆదరణ ఉన్న కొద్ది పెరుగుతున్న నేపథ్యంలో పాటు టీడీపీ చాలావరకు డౌన్ అవుతున్న నేపథ్యంలో బెందాళం అశోక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వస్తుంది.

కాగా ఇదే జరిగితే సొంత జిల్లాలోనే పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చెయ్యలేని అచ్చెన్న కి… అనవసరంగా పార్టీ బాధ్యతలు చంద్రబాబు ఇచ్చారన్న విమర్శలు రావడం గ్యారంటీ అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క అచ్చెన్నయుడు సొంత అన్నయ్య ఎర్రన్నాయుడు కూతురు ఆదిరెడ్డి భవాని కూడా టిడిపిని వెళ్ళటం గ్యారెంటీ అని టాక్ వినపడుతుంది. ఇదే జరిగితే కనుక రాష్ట్రాన్ని ఏలేద్దాం అనుకున్న అచ్చెన్న కి సొంత జిల్లా నాయకులతో పాటు కుటుంబ సభ్యులు బిగ్ షాక్ ఇచ్చినట్లే అని మేధావులు భావిస్తున్నారు.