NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సుశాంత్ మరణానికి లింకేంటి? 

బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు సంచలనంగా మారింది. అసలు సుశాంత్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అన్న దాని విషయంలో సస్పెన్స్ గా ఉన్న ఈ కేసు చుట్టూ తాజాగా పొలిటికల్ వాతావరణం అలుముకుంటుంది. పూర్తి విషయంలోకి వెళితే ఈ కేసు విషయంలో బీహార్ ప్రభుత్వం- మహారాష్ట్ర ప్రభుత్వం నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కేసును ఒకపక్క బీహార్ మరియు మరోపక్క ముంబై పోలీసులు విచారణ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఈ కేసు విషయమై దర్యాప్తు కోసం ముంబై వెళ్లిన బీహార్ ఐపీఎస్ అధికారిని ముంబై పోలీసులు క్వారంటైన్ చేయటం వివాదం రాజుకుంది.

ఈ విషయంలో మహారాష్ట్ర డీజీపీతో తమ డిజిపి మాట్లాడతారని బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలపడంతో మొదలైన గొడవ పెద్ద సంచలనంగా మారింది. దీంతో మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సుశాంత్ కేసును వాడుకుని పొలిటికల్ మైలేజ్ సంపాదించడానికి బీహార్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీ నేతలు ఈ విషయాన్ని వివాదంలోకి నెట్టుతున్నారని ఆయన ఆరోపించారు.

ఎన్నికలు ముగిసిన తర్వాత బీహార్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నేతలు అసలు సుశాంత్ కేసుకు సంబంధించి ఏమీ మాట్లాడారని పట్టించుకోరని పేర్కొన్నారు. కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే బీహార్ రాజకీయ నేతలు సుశాంత్ కేసును అడ్డంపెట్టుకుని హడావిడి చేస్తున్నారని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో పుట్టిన సుశాంత్‌కు ముంబై అన్నీ ఇచ్చిందని ఆయన చెప్పారు.

మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఈ కేసు కి సంబంధించి మహారాష్ట్ర సర్కార్ పాత్ర కూడా ఉన్నట్లు కొంతమంది నటీనటులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా కరోనా నేపథ్యంలో సామూహికంగా జనాలు కూడా అవకాశం లేని తరుణంలో, ఎంతోమందిని ప్రభావితం చేసిన సుశాంత్ సూసైడ్ కేస్ ని అడ్డం పెట్టుకుని బీహార్ పొలిటికల్ పార్టీలు ప్రచారానికి పర్వం లేపారు అన్నట్టుగా కామెంట్లు వస్తున్నాయి. 

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!