BJP : హిమాచల్ ప్రదేశ్ కి చెందిన బిజెపి నాయకుడు పార్లమెంటు సభ్యుడు రామ్ స్వరూప్ శర్మ ఈరోజు సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఢిల్లీలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తో ఈ విషయాన్ని.. ఒక వ్యక్తి ఫోన్ చేసి తెలిపినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పుకొచ్చారు. 62 సంవత్సరాల వయసు కలిగిన రామ్ స్వరూప్ హిమాచల్ ప్రదేశ్ మండి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2014వ సంవత్సరంలో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన రామ్ స్వరూప్ విదేశాంగ వ్యవహారాలకు చెందిన స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు ఒక భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే ప్రస్తుతం శర్మ భార్య చార్‌థామ్ యాత్రలో ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఎంపీ ఆత్మహత్య పై అనేక అనుమానాలు ఉండటంతో ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని అక్కడికి చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్.. పోలీసులకు తెలిపారు.