NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బీజేపీ డేంజర్ వ్యూహం..! టీడీపీ కొమ్మలు నరికేసేలా- వైసీపీ ఆకులు పీకేసేలా..!?

రెండు మాటల కంటే.., తప్పించుకోవడం కంటే.., కీలక అంశాల్లో కప్పదాటు కంటే ఏదో ఒకటి తేల్చేయడం.., స్పష్టత ఇచ్చేయడం మేలు. మన రాష్ట్రంలో అమరావతి అంశం రాజకీయంగా ఇప్పుడు అలాగే ఉంది. టీడీపీ అమరావతి రాజధానిగా ఉండాలని, వైసీపీ మాత్రం మూడు రాజధానులు ఉండాలని అంటుండగా.., బీజేపీ మాత్రం అస్పష్ట రాగాలాపన చేస్తుంది. అందుకే ఇకపై ఒకటి తేల్చేయాలనేది ఆ పార్టీ ప్రణాళిక. అందుకే తగిన ప్లాన్ సిద్ధం చేసుకుని, క్షేత్రస్థాయికి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పనిలోపనిగా తన వద్ద ఉన్న వ్యవస్థల ద్వారా వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తుంది..!

బీజేపీ చేతిలోని రాయి..!!

రాజధాని విషయంలో ఇప్పుడు ఏపీలో గందరగోళం నెలకొంది. ఒకరకమైన రాజకీయ సంక్షోభం నెలకొంది. దీనికి ముగింపు ఇవ్వాల్సింది కోర్టులే. ఇస్తే హైకోర్టు.., లేకపోతే సుప్రీం కోర్టు. అంటే న్యాయవ్యవస్థ చేతిలో రాజధాని అంశం ఉంది. సో.. న్యాయవ్యవస్థ ఎవరి చేతిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చినప్పటి జగన్ ని ముప్పు తిప్పలు పెడుతున్న కోర్టుల వెనుక టీడీపీ ఉందా..? బీజేపీ ఉందా..? అని లోతుగా ఆలోచిస్తే సమాధానం ఇట్టే వచ్చేస్తుంది. రాజకీయంగా చితికిలపడి, గిల గిలా కొట్టుకుంటున్న చంద్రబాబు మాట కంటే పైనున్న బీజేపీ పెద్దల మాటలే న్యాయపెద్దలు వింటారు అనే లాజిక్కు తెలిస్తే చాలు.. ఈ తతంగం వెనుక ఎవరు అనేది తెలుస్తుంది. సో.., రాజధాని అంశంలో ఫైనల్ గా తేల్చాల్సింది బీజేపీ మాత్రమే. ఆ పార్టీకి ఒక స్పష్టత, ఒక బలం వచ్చే వరకు ఇలా బంతిని ఆడిస్తుంది.

ఆరు జిల్లాల్లో పాగా వేయొచ్చు..!!

రాజధాని విషయంలో బీజేపీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నత వర్గాల ద్వారా తెలుస్తుంది. “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక సోర్సు ప్రకారం బీజేపీ రెండు ఆలోచనలు చేసి.. ఒక తుది నిర్ణయానికి వచ్చింది.
* మూడు రాజధానులు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. సీఎం జగన్ మాట నెగ్గినట్టే ఉంటుంది. సో.., ఏమైనా క్రెడిట్ ఉంటె అది జగన్ కె దక్కుతుంది తప్ప బీజేపీకి రాదు. అంటే మూడు రాజధానుల ప్రభావం అంతో కొంత ఉన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో బీజేపీకి మూలాలు దక్కవు సరికదా.., వైసీపీ బలపడుతుంది.

Amaravathi Visakha ; Udyamam Bogus - Media Focus
* అదే అమరావతి స్టాండ్ తీసుకుని.., మద్దతు ప్రకటించి.. ఆ మేరకు నిర్ణయం వచ్చేలా చేస్తే ఆ క్రెడిట్ బీజేపీ ఖాతాలో వేసుకోవచ్చు. కేంద్రం స్థాయిలో పోరాడి, మేమె అమరావతిని రాజకేదానిగా ఉంచాం.., ఇది మా క్రెడిట్ అంటూ ప్రచారం చేసుకోవచ్చు. ఈ లోగా టీడీపీని నిర్వీర్యం చేస్తూ కీలక నేతలను బీజేపీలో కలుపుకోవాలి అనేది వ్యూహం. అంటే.., అమరావతికి అనుకూలంగా తుది నిర్ణయం వచ్చేలా చేసేలోగా “మా వల్లనే ఇది సాధ్యం అయింది, టీడీపీ ఏమి చేయలేకపోయింది” అనేది అమరావతి అనుకూల జిల్లాల్లో (కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం) బాగా చర్చ జరగాలి. తద్వారా ఈ క్రెడిట్ ని బీజేపీ ఖాతాలో వేసుకోవాలి.. ఆ రకంగా ఓట్లు రాబట్టుకోవాలి అనేది బీజేపీ పెద్దల్లో జరిగిన ఓ చర్చ. తీసుకున్న ఓ నిర్ణయం.
* అంటే టీడీపీని టార్గెట్ చేస్తున్నట్టు బీజేపీ కనిపిస్తున్నా… కనిపించని దెబ్బలు వైసీపీపై వేస్తుంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను లోపాయికారీగా తిరస్కరిస్తూ వ్యవస్థల ద్వారా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అలా.. బీజేపీ రాజకీయ డ్రామా ఏపీలో కీలక దశకు చేరుకుంది..!!

 

 

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !