NewsOrbit
రాజ‌కీయాలు

పింకు సామ్రాజ్యానికి కాషాయ గండి..!! కేసీఆర్ కి దుబ్బాక దెబ్బ తగిలినట్టేనా..!?

bjp big shock to trs in dubbaka

తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురు లేదు. 2014 నుంచి ఇప్పటివరకూ తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా పింక్ జెండానే ఎగురుతోంది. కేసీఆర్ మాటే నెగ్గుతోంది. కేటీఆర్, హరీశ్ రావులు నడిపిస్తున్నారు. తెలంగాణ తెచ్చారు అనే బలమైన సెంటిమెంట్ తో ఆ ప్రాంత ప్రజలు టీఆర్ఎస్ ను నెత్తిన పెట్టుకున్నారు. అయితే.. మొదటిసారి టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత విధంగా టీఆర్ఎస్ కు ఓటమి భయం వెంటాడుతోంది. దీనిని బీజేపీ గట్టిగా అందుకుంది. తమకు ఉన్న కేంద్రం పలుకుబడితో ప్రత్యేక అధికారిని నియమించుకోవడం కేసీఆర్ కు షాక్ ఇస్తోంది. దుబ్బాక ఎన్నికల్లో అసలేం జరుగుతోందో తెలుసుకుందాం.

bjp big shock to trs in dubbaka
bjp big shock to trs in dubbaka

టీఆర్ఎస్ పై ఇప్పటికి బీజేపీదే పైచేయి..

మిగిలిన పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేయకమునుపే బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు పోటీలో ఉంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే.. రఘునందన్ రావు మామ ఇంట్లో నగదు దొరకిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పోలీసులే ఆ నగదు ఉంచారని బీజేపీ ఆరోపించింది. ఈక్రమంలో బండి సంజయ్ కుమార్ పై పోలీసులు అవమానకరంగా ప్రవర్తించడం.. ఆయన్ను గాయాలపాలు చేయడం బీజేపీకే ప్లస్ గా మారింది. దీంతో టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిపోయింది. దుబ్బాక ఎన్నికల వ్యవహారంలో జిల్లా కలెక్టర్ తీరును, సీపీ వ్యవహారంపై బీజేపీ నేతలు మొదటి నుంచీ గుర్రుగానే ఉన్నారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డినే ట్రాన్స్ ఫర్ చేయించగలిగారు. అధికారుల తీరుపై ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కే లేఖ రాశారు. దీంతో త‌మిళ నాడుకు చెందిన ఐపీఎస్ అధికారి స‌రోజ్ కుమార్ థాకూర్ ను నియ‌మించింది.

టీఆర్ఎస్ స్వయంకృతాపరాధమేనా..

ఈ పరిణామాలన్నీ పింక్ దళానికి షాక్ కు గురి చేసేవే. సాధారణంగా టీఆర్ఎస్, కేసీఆర్, హరీశ్ రావుల మార్క్ రాజకీయం వేరు. ఏ ఎన్నికల విషయంలో అయినా క్రికెట్ లో స్లెడ్జింగ్ తరహాలో ప్రత్యర్ధులను బలహీనపరుస్తూ వస్తారు. అధికారం అండతో వారు చెప్పిందే వేదం అవుతుంది. కానీ.. ఈసారి టీఆర్ఎస్ కు అదే అధికారం పని చేయకుండా బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతానికి టీఆర్ఎస్ నేతలు కిమ్మనకుండా ఉన్నారు. ఇది కేసీఆర్ కు పెద్ద దెబ్బనే వార్తలు వస్తున్నాయి. గతంలో టీఆర్ఎస్ మార్క్ రాజకీయాల వల్లే టీఆర్ఎస్ కు ఈ పరిస్థితి అనే వ్యాఖ్యలు వస్తున్నాయి.

author avatar
Muraliak

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!