NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tirupati Bypoll : తిరుపతిలో బీజేపీ తీరు..! అభ్యర్ధి ప్రకటన లేకుండా ప్రచార కమిటీ..!?

bjp delay on announcing candidate

Tirupati Bypoll : తిరుపతి ఉప ఎన్నిక Tirupati Bypoll త్వరలో జరగబోతున్న తిరుపతి ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక్కడ గెలిచి పట్టు నిలుపుకోవాలని వైసీపీ, ఉనికి చాటుకోవాలని బీజేపీ, టీడీపీ చూస్తున్నాయి.

బీజేపీ మిత్రపక్షంగా జనసేన సాయం చేయడం ప్రత్యేకంగా పార్టీకి ఒరిగేదేమీ లేదు. ఈ క్రమంలో ఏప్రిల్ 17న జరుగుతున్న ఎన్నిక కోసం పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. వైసీపీ తమ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తిని, టీడీపీ తమ అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని ప్రకటించాయి. అయితే.. బీజేపీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించకుండానే క్షేత్రస్థాయిలో పని చేయడానికి ప్రచార కమిటీని నియమించేసింది. ఉప ఎన్నిక కోసం ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మృతి చెందినప్పటి నుంచీ బీజేపీ తిరుపతిలో పనులు మొదలెట్టేసింది.

bjp delay on announcing candidate Tirupati Bypoll
bjp delay on announcing candidate Tirupati Bypoll

నగరంతోపాటు నియోజకవర్గాల్లో కూడా కేడర్ తిరిగింది. అయితే.. అప్పుడు ఎన్నికల సంఘం ఉప ఎన్నిక తేదీ ప్రకటించలేదు. ఇప్పుడా ప్రకటన వచ్చేసింది. ఇంకా అభ్యర్ధి ప్రకటన లేదు. జనసేన ఇక్కడ పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ.. బీజేపీ తన పంతం నెగ్గించుకుంది. సరే.. జనసేన మిత్రపక్షంగా పని చేస్తుంది. కానీ..

అభ్యర్ధి లేకుండా ప్రజల్లోకి వెళ్లేదెలా? పైగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి  నేతృత్వంలో ప్రచార కమిటీని నియమించింది. నియోజకవర్గాల్లో కూడా ఇంచార్జులను ప్రకటించేసింది. సోము వీర్రాజు, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి. పురంధేశ్వరి, సునీల్ ధియోధర్, జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ, బైరెడ్డి, ఐవైఆర్, రావెల కిశోర్ బాబు.. ఇలా ఎందరెందరో నేతలు అక్కడ కదనరంగంలోకి దిగుతున్నారు. కానీ..

ఇంకా అభ్యర్ధి ప్రకటన లేకుండా ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్తారు. తమ అభ్యర్ధిని గెలిపించండి అని చెప్పడానికి కూడా లేకుండా పార్టీని గెలిపించండి అంటే ఓటర్లు స్వీకరిస్తారా? అనేది ప్రశ్న. బీజేపీ తతంగాన్ని మిత్రపక్షంగా జనసేన చూస్తూ ఉండటం తప్ప ప్రశ్నించలేని పరిస్థితి. తమకు పట్టుందని జనసేన చెప్పినా వినని బీజేపీ జీహెచ్ఎంసీ తర్వాత మరోసారి జనసేనను ఊరుకోబెట్టేసింది. పోనీ.. పోటీకి చూపించిన దూకుడును అభ్యర్థి ప్రకటనలో చూపించిందా అంటే అదీ లేదు. ఎన్నికల ప్రచారం అంటే అభ్యర్ధిని ముందు పెట్టి వెనక పార్టీ నాయకత్వం ఉండాలి. ఇప్పటికైతే బీజేపీ అలా చేయలేదు.. మరెప్పటికి చేస్తుందో..?

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju