NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బిజెపి ఎదుగుదల..అయోధ్య సెంటిమెంట్ పాత్ర..!!(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం పార్ట్ -2)

బీజేపీ పుట్టుక, ఆ పార్టీ ఎదుగుదల, ఆ పార్టీ అధికారంలోకి రావడం, 2014 నాటికి పూర్తి ఏకచక్రాధిపత్యం ప్రదర్శించడం..అవన్నీ పెద్ద మిస్టరీ ఏమి కాదు. కొద్దిగా దృష్టి పెడితే సులువుగా తెలుసుకోగల విషయమే.

దీనిలో ఎన్నో సెంటిమెంట్లు, మరెన్నో వివాదాలు, అంతకు మించిన ఆయుధాలు ఉన్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ శక్తిగా ఎదగడానికి అయోధ్య సెంటిమెంటు ఎంత గానో పని చేసింది.

Bjp gaining Ayodya sentiment

1985 నుంచి 1995 మధ్యలో బిజెపి

1980లో అటల్ బిహారీ వాజపేయి, ఎల్ కే అద్వానీ నాయకత్వంలో బీజేపీ ఏర్పడగా 1984 ఎన్నికల్లో కేవలం రెండు పార్లమెంట్ స్థానాలు మాత్రమే సాధించింది. 1989 ఎన్నికల నాటికి అనూహ్యంగా 85 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. బీజేపీ, వామపక్షాల మద్దతుతో జనతాదళ్ నేత వీపీ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.రామ్ రధయాత్ర సమయంలో అద్వానీతో సహా నేతలను అరెస్ట్ చేరిన క్రమంలో బీజేపీ..వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.

తదుపరి 1991ఎన్నికల్లో మరో 35 సీట్ల అదనంతో 120 పార్లమెంట్ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి అయోధ్య రామ మందిర సెంటిమెంట్ ఉపయోగపడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తదుపరి 1996 ఎన్నికల్లో 161 (+41), 98లో 182(+21) సీట్లు సాధించింది.

అటల్ బిహారి వాజపేయి 96లో 13రోజులు, 98లో 13నెలల పాటు, 1999 నుండి 2004 వరకు పూర్తి కాలం మూడు పర్యాయాలు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.2014లో అధికారంలోకి రావడానికి ముందు గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నారు. జాతీయ స్థాయిలో అద్వాని, మురళి మనోహర్ జోషి, రాజనాథ్ సింగ్, సుస్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ లు ఉన్నారు.

2014లో బీజేపీ అధికారంలోకి రావడంలో మోదీ చరిష్మా తో పాటు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి కార్యకలాపాలు ఒక ఎత్తయితే, ఈ సెంటిమెంట్ కూడా ఎంతోకొంత ప్రభావం చూపించింది. అదే సమయంలో 2014లో కోర్టులో ఈ అయోధ్య తీర్పు పెండింగ్ లో ఉండటం, ఎన్నికల ప్రచార సందర్భంగా రామ మందిరం నిర్మాణంపై మోదీ హామీ ఇవ్వడం ఇవన్నీ కూడా పనిచేసాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju