NewsOrbit
రాజ‌కీయాలు

కేసీఆర్ కి ఊహించని పరీక్ష పెట్టిన బీజేపీ..! ఇది ఆరంభం మాత్రమేనా..!?

bjp giving shcok to cm kcr in ghmc elections

జీహెచ్ఎంసీ ఎన్నికల నిప్పు రోజురోజుకీ మరింతగా మండుతోంది. కార్పొరేషన్ ఎన్నికలు ఏకంగా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ప్రచారం చేస్తూనే ఈ ఎన్నికల్లో మతతత్వాన్ని రగిలిస్తున్నాయి. 2016లో ఏకపక్ష విజయం సాధించిన టీఆర్ఎస్ కు ఈసారి బీజేపీ చుక్కలు చూపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు మతం రంగు పులుముకున్నాయి. కాదు.. బీజేపీ పులిమింది అని చెప్పాలి. బీజేపీ-ఎంఐఎం ఆడుతున్న మైండ్ గేమ్ దెబ్బకి కాంగ్రెస్, టీడీపీ.. ఏం మాట్లాడితే ఎటు వస్తుందోనని సైలెంట్ అయిపోయాయి. అయితే.. ప్రస్తుతానికి బీజేపీ ఎఫెక్ట్ బాగా తగిలిన టీఆర్ఎస్ డిఫెన్స్ లో పడింది. ఏకంగా తానూ హిందూత్వవాదిననే నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్.. పక్కా హిందూవాది అని అనుకూల పత్రికల్లో ఫుల్ పేజీ ఆర్టికల్స్ వేయించుకునే పరిస్థితి వచ్చింది. కాదు.. బీజేపీ తీసుకొచ్చింది.

bjp giving shcok to cm kcr in ghmc elections
bjp giving shcok to cm kcr in ghmc elections

బీజేపీని ఎదుర్కొనే క్రమంలోనే కేసీఆర్ ఇలా

ప్రస్తుతం దేశమంతా బీజేపీ హవానే నడుస్తోంది. అమిత్ షా నేతృత్వంలో వేసే స్కెచ్ లు ఏంటో అర్ధమయ్యేలోపు జరగాల్సింది జరిగిపోతుంది. అలా వేసిన ఎత్తుగడ ఎంఐఎంను ఉపయోగించుకుని బీహార్లో లాభం పొందింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో అదే ఎంఐఎంతో కలిసి సున్నితమైన మతాన్ని తీసుకొస్తోంది. మతం సాయంతో ఓట్లు పొందే ప్రయత్నం చేస్తోంది. ఇది పసిగట్టిన కేసీఆర్ అండ్ కేటీఆర్ తామూ హిందూవాదులమే అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికికిప్పుడు అనుకూల పత్రికల్లో కేసీఆర్ యాదగిరిగుట్ట అభివృద్ధి, హోమాలు, యాగాలు, తెలుగు మహాసభలు.. ఇలాంటి అంశాలతో అనుకూల పత్రికల్లో ఆర్టికల్స్ వేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయంటే.. అదంతా బీజేపీ విసిరిన గాలమే. ‘నిలువెత్తు హిందూత్వం..’ అంటూ కేసీఆర్ హిందుత్వం ఉట్టిపడుతున్న కేసీఆర్ ఫొటోలను వాడుకుంటూ హిందూ ఓట్లు పొందేందుకు చూస్తోంది.

చాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేని కేసీఆర్

కేసీఆర్ బీజేపీని దూనమాడుతూంటే పార్టీ నాయకులు చూస్తూ ఊరుకుంటారా. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఏకచత్రాధిపత్యానికి తగిలిన ఎదురుదెబ్బలు రెండే. ఒకటి ఎంపీ అభ్యర్ధిగా కుమార్తె కవిత ఓటమి.. రెండు దుబ్బాక ఓటమి. రెండూ బీజేపీ చేసిన గాయాలే. ఇప్పుడు మళ్లీ జీహెచ్ఎంసీలో బీజేపీ బలంపై అనుమానం వచ్చిన కేసీఆర్ అండ్ కేటీఆర్ ఈసారి చాన్స్ తీసుకోదలచుకోవట్లేదు. 2016లో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఆ సంఖ్యను 40కి పెంచుకునే క్రమంలో ఉంది. ఈ లెక్కలు ఉండబట్టే టీఆర్ఎస్ లాంటి నిండు కుండ కూడా తొణుకుతోంది.

author avatar
Muraliak

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

క‌దిరిలో ‘ టీడీపీ కందికుంట‌ ‘ కు బాల‌య్య ప్ల‌స్.. !