“పవనా”లు వీస్తాయా… కమలాలు వికసిస్తాయా…?

Share

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనకు బయలుదేరుతుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఒక పక్క హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నెలాఖరులోగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా రిజర్వేషన్ లను ఖరారు చేసింది. ఒకటి రెండు రోజులలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విదుదల చేస్తుందని భావిస్తుండగా మరో పక్క రిజర్వేషన్ ల అంశంపై హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు లో సవాల్ చేసే ఆలోచనలో టీడీపీతో సహా బీసీ సంఘ నేతలు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ స్థానిక ఎన్నికలో పోటీకి సన్నాహాలు ప్రారంభించింది.

బీజేపీ, జనసేన ఉమ్మడిగా స్థానిక సమరంలో తమ బలాన్ని తెలుసుకోనున్నారు. ఎన్నికల విషయంపైనే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన మంగళగిరిలో ఆ పార్టీ నాయకులు సమావేశమై చర్చించారు. ఎన్నికల వ్యూహం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర విషయాలపై బీజేపీ, జనసేన ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ కి బయలు దేరుతున్నారు. పవన్ పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలను కలవనున్నారు. ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పెద్దల భేటీలో ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై నిశితంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పంపకాలపై నేడో రేపో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

రాష్ట్రంలో బీజేపీ, జనసేన బలా బలాల విషయానికి వస్తే బీజేపీ జాతీయ పార్టీ అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో చెప్పుకోదగిన నాయకత్వం లేదు. మండల, గ్రామ కమిటీ లు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాంతాలలో ప్రభావితం చూపే పరిస్థితి లేదు. జనసేన విషయానికి వస్తే పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం జరగలేదు. పలు జిల్లాలలో పవన్ చరిష్మా మూలంగా యువత ప్రభావిత స్థాయిలో ఉన్నారు. అయితే ఓట్ల పరంగా ఎంత వరకు ప్రభావం చుపుతాయనేది వేచి చూడాల్సిందే. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ర్టం లోని అన్ని నియోజక వర్గాలలో పోటీ చేసినా జనసేన, బీజేపీ ఒక్క స్థానం కూడా కైవసం చేసుకోలేక పోయాయి. అయితే పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే పలు కీలక ప్రాంతాలలో అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

10 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago